ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తులకు ఇబ్బందులు కలగనివ్వొద్దు: కలెక్టర్‌, ఎస్పీ

ABN, First Publish Date - 2020-11-29T05:24:58+05:30

కార్తీకపౌర్ణమి సందర్భంగా సోమవారం మంత్రాలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు కలిగించద్దని కలెక్టర్‌ వీరపాండియన్‌, ఎస్పీ ఫక్కీరప్ప అధికారులను ఆదేశించారు.

వృద్ధులకు దుప్పట్లు అందజేస్తున్న కలెక్టర్‌, ఎస్పీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రాలయం/ఎమ్మిగనూరు టౌన్‌, నవంబరు 28: కార్తీకపౌర్ణమి సందర్భంగా సోమవారం మంత్రాలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు కలిగించద్దని కలెక్టర్‌ వీరపాండియన్‌, ఎస్పీ ఫక్కీరప్ప అధికారులను ఆదేశించారు. శనివారం మంత్రాలయం ఘాట్‌ వద్ద వృద్ధులకు దుప్పట్లు, శానిటైజర్‌ అందజేశారు. సంతమార్కెట్‌, వినాయక, వీఐసీ ఘాట్లను పరిశీలించారు. ఘాట్ల వద్ద సౌకర్యాలను తనిఖీ చేశారు. ఆర్డీవో రామకృష్ణారెడ్డి, ఐసీడీఎస్‌ పీడీ భాగ్యరేఖ, వాటర్‌షెడ్‌ అడిషనల్‌ పీడీ సలీంబాషా, డ్వామా ఏపీడీ లోకేష్‌, ఆదోని డీఎస్పీ వినోద్‌కుమార్‌, మంత్రాలయం సీఐ కృష్ణయ్య పాల్గొన్నారు. 


ముగతి సచివాలయం తనిఖీ


నందవరం: మండలంలోని ముగతి గ్రామ సచివాలయాన్ని శనివారం కలెక్టర్‌ వీరపాండియన్‌ తనిఖీ చేశారు. అటెండెన్స్‌ రిజిష్టర్‌ను తనిఖీ చేసి, మిగతా ఉద్యోగులు ఎక్కడ అని ఆరా తీయగా పుష్కరాల విధులకు వెళ్లారని ఉద్యోగులు వివరించారు. ఆయన మూమెంట్‌, రికార్డులను తనీఖీ చేశారు. 


ఎమ్మిగనూరు: సచివాలయాలకు వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్‌ వీరపాండియన్‌ ఆదేశించారు. శనివారం ఎమ్మిగనూరు గాంధీనగర్‌లోని సచివాలయం-1, రాఘవేంద్ర నగర్‌లోని వార్డు సచివాలయాలను ఆకస్మిక తనిఖీ చేశారు.  రిజిస్టర్లు, లబ్ధిదారుల జాబితాను పరిశీలించారు. విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని సూచించారు.

Updated Date - 2020-11-29T05:24:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising