ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తేళ్లు తెచ్చాం స్వామీ..!

ABN, First Publish Date - 2020-08-11T16:19:34+05:30

కొండల రాయుడికి భక్తులు తేళ్లను సమర్పించారు. ఏటా శ్రావణ మాసం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భక్తితో కొండలరాయుడి వేడుక


కోడుమూరు(కర్నూలు): కొండల రాయుడికి భక్తులు తేళ్లను సమర్పించారు. ఏటా శ్రావణ మాసం మూడో సోమవారం ఈ వేడకను నిర్వహిస్తారు. కోడుమూరు సమీపంలోని కొండ్రాయి కొండపై వెలసిన వేంకటేశ్వరున్ని స్థానికులు కొండల రాయుడిగా కొలుస్తారు. ఈ కొండపై ఏ చిన్న రాయిని కదిపినా తేళ్లు కనిపిస్తాయి. వాటిని పట్టుకుని స్వామికి సమర్పించే వింత ఆచారం కొన్ని తరాలుగా కొనసాగుతోంది. పొరపాటున కుట్టినా స్వామికి మూడు సార్లు ప్రదక్షిణ చేసి మొక్కుకుంటారు. తమకు ఎలాంటి నొప్పీ కలగదని భక్తులు అంటున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ అన్ని వయసుల వారూ ఈ వేడుకలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి కూడా పలువురు భక్తులు వచ్చి స్వామిని దర్శించుకున్నారు. 


కుట్టకపోవడం వింతే

చిన్న పిల్లలు కూడా తేళ్ళను పట్టుకోవడం అద్భుతం. కొండపైకి వచ్చి ఈ వింతను చూడటం ఆనందంగా ఉంది.  కొండల రాయుడు మహిమ గల దేవుడని నమ్ముతున్నాం. ఏటా వచ్చి స్వామిని దర్శించుకుని వెళుతుంటాము. 

- లలిత, కోడుమూరు


కళ్లారా చూడాలని..

భక్తితో స్వామిని స్మరించుకుని రాళ్ల కింద ఉన్న తేలుని పట్టుకుని స్వామికి సమర్పించాము. ఈ వింతను కళ్లారా చూడాలని కొండపైకి కాలి నడకన వచ్చాము. స్వామిని దర్శించుకున్నాము. సంతోషంగా ఉంది. 

- విజయలక్ష్మి, కోడుమూరు


Updated Date - 2020-08-11T16:19:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising