ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెద్దాసుపత్రి సూపరింటెండెంట్‌గా డా.జిక్కి

ABN, First Publish Date - 2020-11-03T10:14:59+05:30

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్‌గా నెఫ్రాలజీ సీనియర్‌ ప్రొఫెసర్‌ డా.పీఎన్‌ జిక్కిని నియమిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉత్తర్వులు జారీ చేసిన ప్రిన్సిపల్‌ సెక్రటరీ


కర్నూలు(హాస్పిటల్‌), నవంబరు 2: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్‌గా నెఫ్రాలజీ సీనియర్‌ ప్రొఫెసర్‌ డా.పీఎన్‌ జిక్కిని నియమిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ సూపరింటెండెంట్‌ (ఎఫ్‌ఏసీ)గా పని చేస్తున్న డా.నరేంద్రనాథ్‌ రెడ్డిని తిరిగి కంటి ఆసుపత్రికి పంపారు. దీంతో ఏప్రిల్‌ 4 నుంచి ఆసుపత్రిలో కొనసాగుతున్న తాత్కాలిక పాలను తెరపడింది. అక్టోబరు 13న నెఫ్రాలజీ హెచ్‌వోడీ డా.జిక్కిని కడప మెడికల్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌గా పదోన్నతి కల్పించారు. అయితే కడప ప్రిన్సిపాల్‌గా వెళ్తే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి నెఫ్రాలజీ డీఎం సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని, ఇక్కడే పదోన్నతి కల్పించాలని డా.జిక్కి ప్రిన్సిపల్‌ సెక్రటరీకి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ప్రిన్సిపల్‌ సెక్రటరీ డా.జిక్కిని అడిషినల్‌ డీఎంఈగా పదోన్నతి కల్పించి కర్నూలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా నియమించారు. 

Updated Date - 2020-11-03T10:14:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising