తొలిరోజు పలుచబడి
ABN, First Publish Date - 2020-11-03T10:04:25+05:30
పాఠశాలలు సోమవారం మొదలయ్యాయి. 9, 10 తరగతుల విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మొదటి రోజు 10వ తరగతి విద్యార్థులు మాత్రమే హాజరుకావాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించారు.
అపరిశుభ్రత.. అసౌకర్యాల నడుమ బోధన
గార్గేయపురం హెచ్‌ఎం, ఉపాధ్యాయులపై వేటు
నరసాపురం, ఎల్లావత్తులలో భోజనం పెట్టలేదు
హొళగుందలో ఒకే గదిలో 70 మంది విద్యార్థులు
(న్యూస్ నెట్‌వర్క్, ఆంధ్రజ్యోతి, కర్నూలు): పాఠశాలలు సోమవారం మొదలయ్యాయి. 9, 10 తరగతుల విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మొదటి రోజు 10వ తరగతి విద్యార్థులు మాత్రమే హాజరుకావాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. కొన్ని చోట్ల బడికి వచ్చిన 9వ తరగతి విద్యార్థులను వెనక్కు పంపారు. ఉపాధ్యాయులకు, సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు నుంచి మినహాయింపు ఇచ్చారు. జూనియర్ కాలేజీలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు హాజర య్యారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.45 గంటల వరకు బోధన సాగింది. మొదటి రోజు విద్యార్థులు తక్కువగా వచ్చారు. పిల్లలను బడికి పంపేందుకు తల్లిదం డ్రులు ఇష్టపడటం లేదని ప్రధానో పాధ్యాయులు తెలిపారు. నాడు-నేడు పనులు పూర్తికాని పాఠశాలల్లో విద్యార్థులు అసౌకర్యంగా కనిపించాయి.
విధులకు గైర్హాజరైన గార్గేయపురం జడ్పీహెచ్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఐదుగురు ఉపాధ్యాయులను డీఈవో సాయిరాం సస్పెండ్ చేశారు.
గూడూరు మండలంలో 9వ తరగతి విద్యార్థులు 534 గాను 52 మంది, 10వ తరగతి విద్యార్థులు 547 గాను 164 మంది హాజరు అయ్యారని ఎంఈవో సునీలమ్మ తెలిపారు.
నంద్యాల ఎస్పీజీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులు 133 మందికి గాను 11 మంది, 10వ తరగతిలో 154 మంది విద్యార్థులకు గాను 49 మంది హాజరయ్యారు.
మద్దికెర జిల్లా పరిషత్‌లో 9, 10 తరగతుల విద్యార్థులు 140 మంది ఉండగా, ఆరుగురు వచ్చారు.
తుగ్గలి జడ్పీ హైస్కూల్‌లో 67 మంది 10వ తరగతి విద్యార్థులకు గాను నలుగురు వచ్చారు. తరగతి గదులను వారే శుభ్రం చేసుకుని కూర్చున్నారు.
హొళగుంద జడ్పీ ఉన్నత పాఠశాలలో 150 మంది విద్యార్థులకు గాను 70 మంది హాజరయ్యారు. అందరినీ ఒకే గదిలో కూర్చోబెట్టారు.
ఆళ్ల్లగడ్డ మండలంలో 14 ఉన్నత పాఠశాలల్లో 9, 10 తరగతుల విద్యార్థులు 2,300 మంది ఉన్నారు. మొదటి రోజు 800 మంది హాజరయ్యారు.
బనగానపల్ల్లె మండలంలో 15 శాతం విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యారు.
బేతంచెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 54 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. వీరిలో 30 మంది బడికి వచ్చారని ఎంఈవో సోమశేఖర్ తెలిపారు. తరగతి గదుల మరమ్మతు పనులు జరుగుతుండడంతో పాఠశాల ప్రాంగణంలో తరగతులు నిర్వహిస్తున్నామని హెచ్‌ఎం రంగారెడ్డి తెలిపారు.
మంత్రాలయం జడ్పీ ఉన్నత పాఠశాలలో 9, 10 తరగతి విద్యార్థులు 400 మంది ఉండగా, 222 మంది హాజరయ్యారు.
చాగలమర్రి బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల్లో 9, 10 తరగతి విద్యార్థులు హాజరు అయ్యారు. ఒక్కో గదిలో 16 మంది విద్యార్థులను కూర్చోబెట్టినట్లు ఎంఈవో అనూరాధ తెలిపారు.
రుద్రవరం మండలం పెద్దకంబలూరులో 48 మందికి ఐదుగురు, ఎర్రగుడిదిన్నెలో 26 మందికి 21 మంది, నరసాపురం లో 56 మందికి 37 మంది, ఆలమూరులో 139 మందికి 19 మంది, రుద్రవరంలో 185 మందికి 20 మంది, ఎల్లావత్తులలో 132 మందికి గానూ 70 మంది, ఆదర్శ పాఠశాలలో 157 మందికి 29 మంది, మందలూరు ఎయిడెడ్ స్కూల్‌లో 36 మందికి ముగ్గురు హాజరయ్యారు. నరసాపురం, ఎల్లావత్తుల పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందలేదు. నరసాపురంలో ఒకే గదిలో 23 మందిని కూర్చోబెట్టారు
ప్యాపిలి బాలురు ఉన్నత పాఠశాలలో 160 మందికి 8 మంది మాత్రమే హాజరయ్యారని ఇన్‌చార్జి హెచ్‌ఎం తెలిపారు.
ఫ పగిడ్యాల జడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులు 45 మందికి ముగ్గురు బడికి వచ్చారు. ప్రాతకోట జడ్పీ పాఠశాలలో 10వ తరగతికి విద్యార్థులు 90 మందికి 20 మంది, నెహ్రూనగర్ జెడ్పీ పాఠశాలలో 69 మందికి 60 మంది హాజరయ్యారు.
నందికొట్కూరు జడ్పీ బాలికోన్నత పాఠశాలలో నాడు-నేడు పనుల్లో మరుగుదొడ్లను కూల్చి వేశారు. దీంతో బాలికలు ఇబ్బంది పడుతున్నారు.
కోవెలకుంట్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 190 మంది విద్యార్థులు ఉన్నారు. మొదటి రోజు ఒక్కరూ హాజరు కాలేదు.
జూపాడుబంగ్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో 113 మంది, 9వ తరగతిలో 97 మంది ఉన్నారు. వీరిలో 8 మంది తొలిరోజు వచ్చారని హెచ్‌ఎం విజయభాస్కర్ తెలిపారు. గదుల మరమ్మతు వల్ల వరండాలో పాఠాలు చెప్పారు.
గోనెగండ్లలో మొదటి రోజు 607 మంది విద్యార్థులకుగాను 97 మంది హాజరయ్యారు. 9వ తరగతిలో 312 విద్యార్థులకు గాను 42 మంది, 10వ తరగతిలో 295 మంది విద్యార్థులకు గాను 55 మంది వచ్చారని ఎంఈవో వినోద్ కుమార్ తెలిపారు.
దొర్నిపాడు, భాగ్యనగరం, డబ్ల్యూ.కొత్తపల్లెలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు సోమవారం ప్రారంభమైనట్లు ఎంఈవో మనోహర్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులకు మొదటి రోజు చెట్ల కింద పాఠాలు చెప్పారు.
ఎమ్మిగనూరు జడ్పీ బాలికోన్నత పాఠశాలలో 9, 10 తరగతుల విద్యార్థినులు 227 మంది హాజరయ్యారు. మాస్కులు లేకుండా వచ్చినవారు బయట కూర్చున్నారు. బాలికల జూనియర్ కాలేజీలో తక్కువ మంది హాజరయ్యారు.
ఆలూరులోని ఒకటి, రెండో బాలుర ఉన్నత పాఠశాలలో 15 మందికి మించి విద్యార్థులు హాజరు కాలేదు. కమ్మరచేడు, మొళగవల్లి, హుళేబీడు ఉన్నత పాఠశాలల్లో కూడా 10 మందికి మించలేదు.
కోడుమూరు మండలంలో మొదటిరోజు హాజరు తక్కువగా నమోదైంది. పాఠశాలల్లో హైపో ద్రావణం పిచికారీ చేశారు.
డోన్ బాలికల ఉన్నత పాఠశాలలో 9, 10 తరగతుల విద్యా ర్థులు 619 మందికి గాను 58 మంది హాజరయ్యారు. పాతపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో 581 మందికి గాను 106 మంది హాజరయ్యారు. ఎస్‌కేపీ ఉన్నత పాఠశాలలో 57 మందికిగాను 10 మంది హాజరయ్యారు. చిన్న మల్కాపురం ఉన్నత పాఠశాలలో 180 మందికి గాను 24 మంది హాజరయ్యారు.
తల్లిదండ్రుల అనుమతితోనే విద్యార్థులను పాఠశాలకు అనుమతించాలని కొత్తపల్లిఎంఈవో శ్రీరాములు హెచ్‌ఎంలకు సూచించారు. కొత్తపల్లి జడ్పీహెచ్‌ఎస్, రాజరాజేశ్వరి హైౖస్కూల్, కస్తూర్బా, గోకవరం జడ్పీహెచ్‌ఎస్‌ను ఆయన తనిఖీ చేశారు.
Updated Date - 2020-11-03T10:04:25+05:30 IST