ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారిని పరీక్షలకు అనుమతించండి

ABN, First Publish Date - 2020-11-01T11:33:29+05:30

ప్రైవేటు డీఎడ్‌ కళాశాలల మేనేజ్‌మెంట్‌ (2018-19 బ్యాచ్‌) కోటా విద్యార్థులను పరీక్షలకు అనుమతించాలని ఏఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ నాయకులు శనివారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీఎడ్‌ మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు న్యాయం చేయాలి 

విద్యార్థి, యువజన సంఘాల నాయకుల డిమాండ్‌

మంత్రి గుమ్మనూరు జయరాం కాన్వాయ్‌ అడ్డగింత 


కర్నూలు(ఎడ్యుకేషన్‌), అక్టోబరు 31: ప్రైవేటు డీఎడ్‌ కళాశాలల మేనేజ్‌మెంట్‌ (2018-19 బ్యాచ్‌) కోటా విద్యార్థులను పరీక్షలకు అనుమతించాలని ఏఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ నాయకులు శనివారం కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేశారు. వాల్మీకి మహర్షి జయంతికి హాజరవుతున్న కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కాన్వాయ్‌ను అడ్డుకోవడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. మంత్రి జయరాం విద్యార్థులకు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో కాన్వాయ్‌ను కొద్దిసేపు ముందుకు వెళ్లనివ్వలేదు. కొద్దిసేపు విద్యార్థి సంఘాలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్బంగా విద్యార్థి యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా డీఎడ్‌ ప్రైవేటు కళాశాలల్లో మేనేజ్‌మెంట్‌ కోటా కింద 27 వేల మంది ప్రవేశాలు పొందారని, వారిని పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జీవో.నెం.30ని అడ్డు పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. స్పాట్‌ అడ్మిషన్లలో పొరపాటు జరిగి ఉంటే సంబంధిత కళాశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలిగానీ.. విద్యార్థులకు నష్టం కలిగించకూడదని అన్నారు. 

Updated Date - 2020-11-01T11:33:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising