ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతిపాదనలు సిద్ధం చేయండి

ABN, First Publish Date - 2020-10-31T07:04:47+05:30

బేతంచెర్ల, డోన్‌, ప్యాపిలి మండలాల్లోని 133 గ్రామాల్లోని ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని, పరిష్కారానికి గోరుకల్లు రిజర్వాయరు నుంచి తాగునీటిని ప్రజలకు సరఫరా చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించిన మంత్రి బుగ్గన



బేతంచెర్ల, అక్టోబరు 30: బేతంచెర్ల, డోన్‌, ప్యాపిలి మండలాల్లోని 133 గ్రామాల్లోని ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని, పరిష్కారానికి గోరుకల్లు రిజర్వాయరు నుంచి తాగునీటిని ప్రజలకు సరఫరా చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం బేతంచెర్ల నగర పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో ఓఎ్‌సడీ ప్రతా్‌పరెడ్డి అధ్యక్షతన జిల్లా ఇంజనీరింగ్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలన్నారు. ఈ సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు, ఇంజనీరింగ్‌ చీఫ్‌ కృష్ణారెడ్డి, చీఫ్‌ ఇంజనీర్‌ సంజీవరావు, ఎస్‌ఈ విద్యాసాగర్‌, ఈఈ మనోహర్‌, డీఈలు ఉమాకాంత్‌రెడ్డి, రమే్‌షకుమార్‌రెడ్డి, ఏఈలు బాలకృష్ణ, సతీష్‌, మహబూబ్‌ఖాన్‌, బేతంచెర్ల తహసీల్దారు విద్యాసాగర్‌, ఎంపీడీవో అశ్వినికుమార్‌, నగర కమిషనర్‌ రమే్‌షబాబు, ఈవోఆర్డీ మోహన్‌కుమార్‌, ఇరిగేషన్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, పీఆర్‌, ఇంజనీరింగ్‌ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 


బాధితులకు పరిహారం పంపిణీ : మండలంలోని గూటుపల్లె గ్రామానికి చెందిన షేక్‌ షేక్షావలి, పర్వీన్‌ దంపతులకు చెందిన మట్టిమిద్దె ఈ నెల 2న కూలిపోయింది. బాధితులకు ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.4లక్షల చెక్కును ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శుక్రవారం పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విపత్తు పథకం కింద ఈ నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. వైసీపీ నాయకులు నాగభూషణంరెడ్డి, బాబుల్‌రెడ్డి, మండల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-31T07:04:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising