ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు నెలల్లో విమానాల రాకపోకలు

ABN, First Publish Date - 2020-10-03T10:42:49+05:30

విమానాశ్రయ పనులు త్వరితగతిన పూర్తి చేసి రెండు నెలల్లో విమానాల రాకపోకలు ప్రారంభిస్తామని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వల్లవన్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి 


ఓర్వకల్లు, అక్టోబరు 2: విమానాశ్రయ పనులు త్వరితగతిన పూర్తి చేసి రెండు నెలల్లో విమానాల రాకపోకలు ప్రారంభిస్తామని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వల్లవన్‌ తెలిపారు. ఓర్వకల్లు విమానాశ్రయాన్ని ఆయనతో పాటు జేసీ రవి పటాన్‌శెట్టి, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఎయిర్‌పోర్టు ఎండీ భరత్‌ రెడ్డి, డైరెక్టర్‌ కైలాష్‌ మందన్‌, పైలట్‌ ట్రైనింగ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ హేమంత్‌ పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 15లోపు పనులు పూర్తి కావాలన్నారు.


రెండు నెలల్లో విమానాలు రాకపోకలు జరుగుతాయన్నారు. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు విమానాశ్రయాన్ని పరిశీలించామన్నారు. విమానాశ్రయం ద్వారా ఇండస్ట్రియల్‌ హబ్‌, ఎయిర్‌పోర్టు సిటీ అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. అనంతరం రన్‌వే పనులను పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శివరాముడు, ఎస్‌ఐ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-03T10:42:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising