కేఈ ప్రభాకర్ రాజీనామా వెనుక అసలు కారణాలివీ..
ABN, First Publish Date - 2020-03-14T11:31:52+05:30
జల్లా టీడీపీ ముఖ్య నాయకుడు కేఈ ప్రభాకర్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో పదవులు అనుభవించిన కేఈ ప్రభాకర్ ఇపుడు కార్పొరేటర్ల ఎన్నికల సమయంలో పార్టీకి గుడ్‌బై చెప్పారు.
వలస నాయకుల పెత్తనం ఎక్కువైంది
కార్యకర్తలకు అన్యాయం జరుగుతోంది
ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్
టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన
కర్నూలు, మార్చి 13(ఆంధ్రజ్యోతి): జల్లా టీడీపీ ముఖ్య నాయకుడు కేఈ ప్రభాకర్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో పదవులు అనుభవించిన కేఈ ప్రభాకర్ ఇపుడు కార్పొరేటర్ల ఎన్నికల సమయంలో పార్టీకి గుడ్‌బై చెప్పారు. అనుచరులకు కార్పొరేటర్ల్ల సీట్లు కేటాయించనందున పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాని ఆయన తెలిపారు. అయితే తన ఎమ్మెల్సీ పదవికి మాత్రం రాజీనామా చేయనని అన్నారు.
కర్నూల్లోని కార్యాలయంలో విలేఖరులతో ఆయన శుక్రవారం మాట్లాడుతూ ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే అధికారం చెలాయిస్తున్నారని, తమకు కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల్లో కేవలం 3 కార్పొరేటర్ సీట్లను అడగ్గా విముఖత చూపారని ఆయన ఆరోపించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు కర్నూలు పార్లమెంటుతో పాటు నంద్యాల పార్లమెంటుల్లోనూ జోక్యం చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న డోన్ నియోజకవర్గం విషయంలో కూడా వారే నిర్ణయాలు తీసుకోవడంతో కార్యకర్తలకు న్యాయం జరగట్లేదని అన్నారు.
ఈ కారణంగా పార్టీలో తాను కొనసాగబోమని రాజీనామా పత్రాన్ని జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లుకు పంపినట్లు ఆయన తెలిపారు. పోలీసుల అర్ధరాత్రి పూట వచ్చి డోన్లోని తమ కార్యకర్తలు, అభ్యర్థుల ఇళ్ల మీద దాడి చేస్తున్నారు. మా కోసం కార్యకర్తల్ని బలిచేయడం ఇష్టంలేక స్థానిక ఎన్నికల పోటీ నుంచి విరమించుకున్నామని తెలిపారు.
Updated Date - 2020-03-14T11:31:52+05:30 IST