ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాత్రను అడ్డుకోవటం దారుణం: జయనాగేశ్వరరెడ్డి

ABN, First Publish Date - 2020-02-28T10:51:47+05:30

ప్రజాస్వామ్య దేశంలో ప్రజాచైతన్య యాత్రను అడ్డుకోవటం దారుణమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మిగనూరు, ఫిబ్రవరి 27: ప్రజాస్వామ్య దేశంలో ప్రజాచైతన్య యాత్రను అడ్డుకోవటం దారుణమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. ఆయన  గురువారం ఆంధ్రజ్యోతితో ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందనటానికి వైజాక్‌ ఎయిర్‌ పోర్టులో చంద్రబాబును వైసీపీ శ్రేణులు, నాయకులు అడ్డుకోవటం నిదర్శనమని అన్నారు. ప్రజలను చైతన్య వంతులను చేసేందుకు వెళ్తున్న ఒక మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడిని ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు దగ్గరుండి పోలీసులతో దుర్మార్గంగా  అడ్డుకున్నారని మండిపడ్డారు. టీ డీపీ ప్రభుత్వంలో జగన్‌ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేశారని, ఎక్కడా ఎవరూ అడ్డుకోలేదని అన్నారు. చంద్రబాబుపై కక్షతోనే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో విశాఖలో ఇండస్ట్రియల్‌ సమ్మిట్‌ జరిగే సమయంలో జగ న్‌ ప్రత్యేక హోదా పేరుతో లేనిపోని రాద్ధాంతం చేసేందు వచ్చారని, అందుకే అడ్డుకున్నామని అన్నారు. నేడు ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. గతంలో జరిగిన సంఘటనను మనసులో పెట్టుకుని ప్రజాచైతన్య యాత్రకు ఉత్తరాంధ్ర వెళ్లిన చంద్రబాబును అడ్డుకోవటం సరికాదని అన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చైతన్య యాత్రలో చంద్రబాబుకు విపరీతమైన ఆదరణ లభిస్తోందని, ఉత్తరాంధ్రలో పర్యటిస్తే విశాఖలో తమ భూ బాగోతం ఎక్కడ భయటపడుతుందోనన్న భయంతో చంద్రబాబును అడ్డుకుంటున్నారని ఆరోపించారు. విశాఖలో చంద్రబాబు పర్యటిస్తే ఆయనకు లభించే ఆదరణతో, రాజధానిపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కడ బయట పడుతుందోనని కుట్రపూరితంగా అడ్డుకున్నారని అన్నారు. జగన్‌ పాలనపై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చిందని, దాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు.

Updated Date - 2020-02-28T10:51:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising