ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవదాయ శాఖ భూమిలో అక్రమ తవ్వకాలు

ABN, First Publish Date - 2020-05-17T09:53:54+05:30

మండలంలోని కొండజూటూరులో దేవదాయ శాఖకు చెందిన వ్యవసాయ భూమిలో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టడంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 అడ్డుకున్న గ్రామస్థులు


పాణ్యం, మే 16: మండలంలోని కొండజూటూరులో దేవదాయ శాఖకు చెందిన వ్యవసాయ భూమిలో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టడంతో గ్రామస్థులు అడ్డుకున్నారు. లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ అర్చకుడు తనకు అర్చకత్వానికి ఇచ్చిన భూమిలో మట్టిని తవ్వి అమ్ముకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.  అర్చకత్వానికి తనకు ఇచ్చిన భూమిలో చదును నిమిత్తం మట్టి తరలిస్తున్నట్లు  అర్చకుడు రామయ్య శర్మ తెలిపారు. మట్టిని తరలించే దశలో ట్రాక్టర్లు గ్రామంలో విచ్చలవిడిగా వెళ్తూ మట్టిని పారబోస్తుండడంతో గ్రామంలో దుమ్ము పెరిగి ఇబ్బందిగా మారిందని గ్రామస్థులు ఆరోపించారు.

 

మట్టి తవ్వకాలకు అనుమతి లేదు- వేణునాథరెడ్డి, ఈవో, దేవదాయ శాఖ, పాణ్యం 

 అర్చకులకు ఇచ్చిన భూముల్లో దేవదాయశాఖ అనుమతి లేకుండా ఎటువంటి తవ్వకాలు చేపట్టకూడదు. తవ్వకాలు చేపట్టిన అర్చకుడిని మందలించాం. తవ్విన మట్టిని గ్రామ ప్రజల సహకారంతో గ్రామ అభివృద్ధికి వినియోగించాలి. మట్టి పంటపొలాల రస్తాలకు, పొలం గట్లకు వినియోగించాలి. మట్టి అమ్మకాలు చేపడితే చర్యలు తీసుకుంటాం.


Updated Date - 2020-05-17T09:53:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising