ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటి స్థలాలపై హైకోర్టు స్టే

ABN, First Publish Date - 2020-07-14T11:00:36+05:30

పేదల అభ్యున్నతే తమ ధ్యేయమని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం ఇండ్ల స్థలాల పంపిణీలో అన్యాయం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మద్దికెర, జూలై 13: పేదల అభ్యున్నతే తమ ధ్యేయమని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం ఇండ్ల స్థలాల పంపిణీలో అన్యాయం చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వివాదం చివరికి కోర్టు దాకా వెళ్లింది. పేదల ఇళ్ల స్థలాల జాబితాలో అధికార పార్టీకి చెందిన అనర్హులే ఎక్కువ మంది ఉన్నారని తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు స్టే ఇచ్చింది. మండల కేంద్రమైన మద్దికెర గ్రామంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు మొత్తం 24.60 ఎకరాల భూమిని కేటాయించింది.


640 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి లేఅవుట్లు కూడా చేశారు. అయితే ఆ జాబితాలో అధికార పార్టీ నాయకులకు, వారి సమీప బంధువులకు ఎక్కువగా కేటాయించారనే విమర్శలు వచ్చాయి.  2005లో ఆ స్థలాల్లో కె.లలిత, యశోద, నాగవేణి, జి.వసంత, సరస్వతి, లక్ష్మి, గంగమ్మ, పులికొండమ్మ, పద్మావతి, ధనలక్ష్మిలకు సర్వే నెం.444/2బి, 552/2, 522/2, 552/2బిలో ఇళ్ల పట్టాలను ఇచ్చారు. అయితే ఇప్పుడు కొత్త జాబితాలో వీరి పేర్లు లేవు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. 15ఏళ్ల నుంచి ఇళ్ల పట్టాల పంపిణీ పేదలకు కలగానే మిగిలిపోయింది. 


అర్హులకు మాత్రమే ఇస్తాం ..వెంకటలక్ష్మి, తహసీల్దార్‌ 

 అర్హులకు మాత్రమే ఇళ్ల స్థలాలు ఇస్తాం. అనర్హులకు ఇచ్చే ప్రసక్తి లేదు. కోర్టుకు వెళ్లిన వారికి కూడా విచారణ జరిపి ఇళ్ల పట్టాలు ఇస్తాం. 

                                   

Updated Date - 2020-07-14T11:00:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising