పవన్‌కు కథ నచ్చలేదు కానీ.. (గుర్తుకొస్తున్నాయి)
ABN, First Publish Date - 2020-03-16T11:04:20+05:30
పవన్‌కు కథ నచ్చలేదు కానీ.. (గుర్తుకొస్తున్నాయి)
నేడు 1-5 తరగతుల విద్యార్థులకు బేస్ లైన్ పరీక్షలు
ఆలూరు, మార్చి 15: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడంతో పాటు గుణాత్మక శిక్షణ కోసం వారధి అనే కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ రూపొందించింది. విద్యార్థులపై తరగతులకు వెళ్లేందుకు అవసరమైన పునాది ఏర్పరచడమే లక్ష్యంగా వారధి పేరిట బ్రిడ్జీ కోర్సును దాదాపు నెల రోజుల పాటు నిర్వహించనున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులకు దీన్ని నిర్వహిస్తారు.
నేడు బేస్‌లైన్ పరీక్షలు..: జిల్లాలో 2874 ప్రభుత్వ, యాజమాన్య పరిధిలో ఉన్న పాఠశాలల్లో చదివే 2,14,913 మంది 1-5 తరగతి చదివే విద్యార్థులకు సోమవారం బేస్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రాలను డీసీఈబీ ద్వారా సరఫరా చేశారు. ప్రశ్నపత్రం 50 మార్కులకు ఉంటుంది. తెలుగు 15 ప్రశ్నలు, గణితం 15 ప్రశ్నలు, ఇంగ్లీష్ 20 ప్రశ్నలు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు విద్యార్థులకు నిర్వహించే బేస్‌లైన్ పరీక్షల్లో పొందే మార్కులు ఆధారంగా విద్యార్థులకు ఒకటో స్థాయి, రెండో స్థాయిలుగా విభజిస్తారు. తెలుగు, మ్యాథ్స్‌లో 8 మార్కులుకన్నా తక్కువ ఇంగ్లీ్‌షలో పది మార్కులకన్నా ఎక్కువ పొందే విద్యార్థులు రెండో స్థాయిలోకి వస్తారు. విద్యార్థుల స్థాయికి అనుగుణంగా అఽధ్యయన పుస్తకాలను డీసీఈబీ ద్వారా ముద్రించి ఈ నెల 17న ఉపాధ్యాయులకు అందజేస్తారు. వీటితో పాటు వారధి కార్యక్రమానికి సంబంధించిన టైం టేబుల్ పట్టికతో కూడిన పుస్తకాలను పంపిణీ చేస్తారు.
విద్యార్థుల్లో సామర్థ్యాన్ని గుర్తించేందుకే బేస్‌లైన్ పరీక్షలు-సాయిరాం, డీఈవో
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి విద్యార్థుల్లో సామర్థ్యాలను గుర్తించేందుకు వారధి కార్యక్రమం పేరిట బేస్‌లైన్ పరీక్షలను జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 1-5వ తరగతి చదివే 2,14,913 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు.
Updated Date - 2020-03-16T11:04:20+05:30 IST