ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుష్కరాల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు

ABN, First Publish Date - 2020-11-14T04:04:47+05:30

తుంగభద్ర పుష్కరాల నిర్వహణపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీవీ జయనాగే శ్వరరెడ్డి ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి 


ఎమ్మిగనూరు టౌన్‌, నవంబరు 13: తుంగభద్ర పుష్కరాల నిర్వహణపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీవీ జయనాగే శ్వరరెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఎమ్మిగనూరులో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ సమీక్షల పేరుతో హడావుడి, హంగామాలు తప్ప మరేమీ చేయలేదని ఆరోపించారు. తాను సూచించిన సలహాలను పాటించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 13వ తేదీలోపు పనులు పూర్తిచేస్తామన్న ప్రభుత్వం, అధికారులు నేడు చావు కబురు చల్లగా చెప్పినట్లు   పుష్కరాల్లో స్నానాలకు అనుమతి లేదని ప్రకటించారని అన్నారు. స్నానాలు లేనపుడు రూ. వందల కోట్ల నిధులతో ఘాట్ల నిర్మాణానికి టెండర్లను ఎందుకు  పిలిచారని అన్నారు. ఇదంతా వైసీపీ నాయకులు, కాంట్రాక్టర్ల కోసమేనా? అని ప్రశ్నించారు. దీపావళి రోజు కేవలం రెండు గంటలే టపాసులు కాల్చాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వటం దారుణమన్నారు. ప్రభుత్వానికి, మంత్రులకు ఫోన్లలో పేకాటపై చర్చించేం దుకు సమయం ఉందని, ప్రజల సమస్యలపై చర్చించే సమయం లేదన్నారు. నంద్యాలలో సలాం  కుటుంబం ఆత్మహత్యపై సీబీఐ విచారణ చేయాలని కోరితే ప్రభుత్వం స్పందించలేదని, రూ.కోటి పరిహారం ఇవ్వాలనే విషయం  పట్టించుకోలేదని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు  ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.  ప్రభాకర్‌నాయుడు, ముల్లాకలీముల్లా, సుంద రరాజు, ప్రతాప్‌ ఉరుకుందయ్య శెట్టి, సలీం, అల్తాఫ్‌, సలాం, ఉప్పర ఆంజనేయులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-14T04:04:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising