ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమాయకులకు రక్షణ కరువు

ABN, First Publish Date - 2020-12-14T05:16:03+05:30

రాష్ట్రంలో అమాయకులకు రక్షణ కరువైందని, అరాచకవాదులు పేట్రేగిపోతున్నా పోలీసు యంత్రాంగం చూస్తూ మిన్నకుండుపోతుం దని టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రభు త్వంపై ధ్వజమెత్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1.   సోమిశెట్టి వెంకటేశ్వర్లు ధ్వజం


కర్నూలు(అగ్రికల్చర్‌), డిసెంబరు 13: రాష్ట్రంలో అమాయకులకు రక్షణ కరువైందని, అరాచకవాదులు పేట్రేగిపోతున్నా పోలీసు యంత్రాంగం చూస్తూ మిన్నకుండుపోతుం దని టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రభు త్వంపై ధ్వజమెత్తారు. ఆదివారం నగరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నం ద్యాలలో ఆర్యవైశ్యుడు పోలిశెట్టి సత్యనారాయణ అద్దె చెల్లించమని అడిగినందుకు ఇళ్ళల్లో అద్దెకున్న వారు దాడి చేసి గాయపరచడం దారుణమన్నారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో తరుచుగా జరుగుతూనే ఉన్నా ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు.  పోలిశెట్టి సత్యనారాయణపై దాడి చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. త్వరలోనే సీఎం జగన్‌కు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని, ప్రజల వైఖరిని గుర్తించడం వల్లే సీఎం స్థానిక సంస్థల ఎన్నికలను ఎలాగైనా వాయిదా వేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ఎన్నికల అధికారి నిర్ణయాన్ని అడ్డుకుంటున్నట్లు ఆరోపించారు. 

Updated Date - 2020-12-14T05:16:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising