ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసు స్టేషన్‌ ఎదుట గిరిజనుల నిరసన

ABN, First Publish Date - 2020-12-02T06:27:48+05:30

ప్రేమించుకున్న ఓ జంట పోలీ్‌సస్టేషన్‌ను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన ఘర్షణ పోలీసులకు, గిరిజనులకు తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దారి తీసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. సీఐతో బాధితుల వాగ్వాదం


పత్తికొండటౌన్‌, డిసెంబరు 1: ప్రేమించుకున్న ఓ జంట పోలీ్‌సస్టేషన్‌ను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన ఘర్షణ పోలీసులకు, గిరిజనులకు తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దారి తీసింది. దీంతో  పోలీసుల వైఖరిని నిరసిస్తూ గిరిజనులు పత్తికొండ పోలీ్‌సస్టేషన్‌ ఎదుట మంగళవారం నిరసన తెలిపారు.  తుగ్గలి మండలం దిగువ చెరువుతండాకు చెందిన రాము నాయక్‌, తకారమ్మల కుమార్తె  అనంతపురం జిల్లాకు చెందిన ఓ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. యువతి  తల్లిదండ్రులు పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  పత్తికొండ పోలీసులు ఆ జంటను మంగళవారం స్టేషన్‌కు   రప్పించారు. సీఐ ఆదినారాయణరెడ్డి  దగ్గర ఇరు వైపుల కుటుంబ సభ్యులతో పంచాయితీ జరుగుతున్నప్పుడు యువతి తండ్రి ఆమెపై చెప్పు విరిసారాడు. దీంతో సీఐ ఆగ్రహించి  సీఐ బాధితుల్లో ఒకరిపై  చేయి చేసుకున్నారు. దీంతో  పంచాయితీకి వచ్చిన గిరిజనులంతా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీ్‌సస్టేషన్‌ ఎదుట నిరసన తెలిపారు. ఒక  దశలో సీఐకి, గిరిజనులకు  తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది. పలు రాజకీయ పార్టీల  నాయకులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించేందుకు  ప్రయత్నించారు. అయినా బాధితులు ఈ విషయాన్ని  జిల్లా ఉన్నతాధికారులకు,  మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై సీఐ మాట్లాడుతూ తన సమక్షంలో యువతిపై చెప్పు విసరడంతో మందలించానని వివరణ ఇచ్చారు.  సమస్య పెద్దదిగా కాకుండా చూసేందుకు ఒకరిని మందలించానని సీఐ తెలిపారు. 

Updated Date - 2020-12-02T06:27:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising