ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘భవిష్యత్తు బీజేపీదే’

ABN, First Publish Date - 2020-12-06T05:08:17+05:30

రానున్న ఎన్నికల్లో భవిష్యత్తు బీజేపీదేనని, తెలంగాణ, ఏపీలో బీజేపీని ప్రజలు ఎన్నుకుంటారని బీజేపీ యువ నాయకుడు భూమా కిశోర్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆళ్లగడ్డ, డిసెంబరు 5: రానున్న ఎన్నికల్లో భవిష్యత్తు బీజేపీదేనని, తెలంగాణ, ఏపీలో బీజేపీని ప్రజలు ఎన్నుకుంటారని బీజేపీ యువ నాయకుడు భూమా కిశోర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ఆయన స్వగృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం నవశకానికి నాంది అని అన్నారు. ఏపీలో వైసీపీ పాలన భ్రష్టు పట్టిందని ఆయన అన్నారు. ప్రజల మెప్పు కోసం సీఎం జగన్‌ సంక్షేమ పథకాలు అమలు చేసి అభివృద్ధిని పూర్తిగా విస్మరించారన్నారు. నియోజకవర్గంలో 2019 వరకు జరిగిన అభివృద్ధి తప్ప ఇంతవరకు ఒక్క అభివృద్ధి పని జరగలేదన్నారు. పైగా మున్సిపాల్టీలలో ఆస్తి పన్ను పెంచి ప్రజలకు ఒక చేతితో మరో చేతితో లాక్కుంటున్నారని ఆరోపించారు. నివర్‌ తుఫాన్‌ వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 25 వేలు నష్టపరిహారం అందించాలని డిమాండు చేశారు. మున్సిపాల్టిలో మురికి నీటి పారుదల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో ప్రజలకు రోగాలు అంటుకునే ప్రమాదం కరోనా కాలంలో ఉందని అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అధికారులు, ప్రజాప్రతి నిధులు పట్టించుకోక పోవడం ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమన్నారు. నివర్‌ తుఫాన్‌ వల్ల రైతులకు జరిగిన నష్టాన్ని అసెంబ్లీలో మాట్లాడతానని చెప్పిన ఎమ్మెల్యే ఊసెత్తలేదని ఆయన అన్నారు. సమావేశంలో పుట్టాలమ్మ క్షేత్రం మాజీ చైర్మన్‌ అంబటి మహేశ్వరరెడ్డి, మోహన్‌రెడ్డి ఉన్నారు.


బీజేపీ విజయంపై హర్షం 

చాగలమర్రి: హైదరాబాదు గ్రెటర్‌ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ 49 స్థానాల్లో విజయం సాధించడం పట్ల ఆ పార్టీ నాయకుడు బ్రహ్మానం దరెడ్డి శనివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దిశగా బీజేపీ పయనిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-12-06T05:08:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising