ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎద్దులు లేని సేద్యం

ABN, First Publish Date - 2020-07-06T10:57:45+05:30

వ్యవసాయంతో రైతు బతకడమే కష్టమైంది. ఇంక కాడెద్దులను ఏం కొంటారు..? వాణిజ్య ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోడుమూరు రూరల్‌/మద్దికెర, జూలై 5: వ్యవసాయంతో రైతు బతకడమే కష్టమైంది. ఇంక కాడెద్దులను ఏం కొంటారు..? వాణిజ్య పంటల కారణంగా గ్రాసం కూడా దొరకడం లేదు. వాటిని ఎలా పోషిస్తారు..? అందుకే.. అవసరం మేరకు బాడుగ ఎద్దులు, ట్రాక్టర్లు..! వాటికీ డబ్బులు లేనివారు ఇలా ఇంటి మనుషులతోనే సర్దుకుపోతారు. ఈ రెండు ఫొటోలు రాయలసీమ సేద్యపు సంక్షోభానికి నిదర్శనం. 


కోడుమూరు మండలం ఎర్రదొడ్డి గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్వర్లు రెండు ఎకరాల్లో బెండ, టమోటా సాగు చేశాడు. కలుపు మొక్కలను తొలగించడానికి బాడుగ ఎద్దుల ఖర్చు భరించలేక తన కొడుకులు శ్రీకాంత్‌, మహేష్‌ సాయంతో పని పూర్తి చేశాడు. శ్రీకాంత్‌ తిరుపతి ఎస్వీయూలో బీఎస్సీ చివరి ఏడాది, మహేష్‌ తిరుపతి ఎస్వీ గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో సివిల్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటి పట్టున ఉంటూ.. వ్యవసాయంలో తండ్రికి సాయపడుతున్నారు. రైతు భార్య శకుంతల రసాయన ఎరువులు చల్లుతూ కనిపించింది. మద్దికెర మండలంలోని ఎం.అగ్రహారం గ్రామానికి చెందిన రైతు కుటుంబం వరి నారు మడిని సిద్ధం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. ఎద్దుల సాయం లేకుండా ముగ్గురు కలిసి పని పూర్తి చేశారు.

Updated Date - 2020-07-06T10:57:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising