ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీఎస్‌సీ అంగీకార పత్రానికి వ్యవధి పొడిగింపు

ABN, First Publish Date - 2020-05-18T09:45:43+05:30

2008 డీఎస్‌సీ అభ్యర్థులు కాంటాక్టు బేసిస్‌ విధానం కింద పని చేయడానికి అంగీకార పత్రాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(ఎడ్యుకేషన్‌), మే 17: 2008 డీఎస్‌సీ అభ్యర్థులు కాంటాక్టు బేసిస్‌ విధానం కింద పని చేయడానికి అంగీకార పత్రాన్ని సమర్పించేందుకు సోమవారం వరకు గడువు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.సాయిరాం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2008 డీఎస్సీలో ఎంపిక కాని అభ్యర్థులు 463 పోస్టులకు గాను కాంటాక్టు పద్ధ్దతిన పని చేసేందుకు 185 మంది అంగీకారపత్రాన్ని సమర్పించినట్లు డీఈవో తెలిపారు. 2008-డీఎస్సీలో వంద శాతం ఎంపికై, 70 శాతం, 30 శాతం కింద బీఈడీ, డీఈడీ కోటా కింద జిల్లాలో మొత్తం 463 మంది ఉన్నారన్నారు. రూ.21,230లతో అభ్యర్థులు నియామకం నుంచి పదవీ విరమణ పొందే వరకు షరతులతో కూడిన నిబంధనలతో నియామకం జరుగుతుందన్నారు.


డీఎస్సీలో ఎంపికైన 463 పోస్టులలో ఎస్‌జీటీ-తెలుగు 452 పోస్టులకు గాను 181 మంది అభ్యర్థులు, ఉర్దూ-ఎస్‌జీటీ 7 పోస్టులకు గాను ఇద్దరు, కన్నడ ఎస్‌జీటీ 4 పోస్టులకు గాను ఇద్దరు అభ్యర్థులు అంగీకారపత్రాన్ని సమర్పించారన్నారు. అంగీకారం పత్రం సమర్పించని  ఎస్‌జీటీ అభ్యర్థుల జాబితాను జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు. ఈ నెల 18న మధ్యాహ్నం 3 గంటలలోపు అంగీకారపత్రాన్ని డీఈవో కార్యాలయానికి పంపాలని తెలిపారు. 


Updated Date - 2020-05-18T09:45:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising