ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయండి’

ABN, First Publish Date - 2020-12-29T04:49:38+05:30

ఆదోనిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని రాయలసీమ విద్యార్థి పరిషత్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఆదోని(అగ్రికల్చర్‌), డిసెంబరు 28: ఆదోనిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని రాయలసీమ విద్యార్థి పరిషత్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక భీమాస్‌ సర్కిల్‌లో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అతి ప్రచీనమైన 156 ఏళ్లు చరిత్ర కలిగిన ఆదోని మున్సిపాలిటీలో ప్రభుత్వ కళాశాలలు లేకపోవడం సిగ్గుచేటన్నారు. 30 ఏళ్లుగా విద్యార్థి సంఘాలు పోరాడుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గత రెండేళ్ల క్రితం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు జీవో విడుదలైనప్పటికీ అధికారంలోకి వచ్చిన వైసీపీ కనీసం నోరుమెదపడం లేదని అన్నారు. విద్యార్థుల్లో చైతన్యం తీసుకొచ్చి పోరాడుతామని హెచ్చరించారు. 

Updated Date - 2020-12-29T04:49:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising