ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘విద్యుత్‌ చార్జీలు తగ్గించాలి’

ABN, First Publish Date - 2020-05-23T10:21:52+05:30

రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్‌ చార్జీలను తగ్గించాలని జనసేన కార్యకర్తలు రేణువర్మ, చిరుతరాజు, రఘు, రాజశేఖర్‌, డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక జనసేన పార్టీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదోని(అగ్రికల్చర్‌), మే 22: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్‌ చార్జీలను తగ్గించాలని జనసేన కార్యకర్తలు రేణువర్మ, చిరుతరాజు, రఘు, రాజశేఖర్‌, డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో దీక్షలు చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ విద్యుత్‌ చార్జీలను పెంచి పేదప్రజలపై భారం మోపిందని ఆరోపించారు. ప్రభుత్వ భూములను చౌరధరకే అమ్మడం భావ్యంకాదన్నారు. మూడు నెలల విద్యుత్‌ చార్జీలను రద్దు చేయాలని కోరారు. నాయకులు ఉమేష్‌, ప్రకాష్‌, నవీన్‌ పాల్గొన్నారు.  


ఆస్పరి: పెంచిన విద్యత్‌ చార్జీలను తగ్గించాలని బీజేపీ, జనసేన పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక బీజేపీ కార్యాలయంలో మౌనదీక్ష చేపట్టారు. నాయకులు వెంకటరాముడు, అరవింద్‌, హేమంత్‌, సంజన్న, లక్ష్మన్న, చిన్న రంగస్వామి, ముద్దయ్య, శివ, రంజిత్‌, విష్ణు, సాయి పాల్గొన్నారు. 


హొళగుంద: లాక్‌డౌన్‌లో పెంచిన విద్యుత్‌ చార్జీలను రద్దు చేయాలని టీడీపీ మండల కన్వీనర్‌ తిప్పయ్య శుక్రవారం డిమాండ్‌ చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో పేదలపై విద్యుత్‌ చార్జీలు భారాన్ని మోపడం సరికాదన్నారు. నాయకులు ఈరన్న, సురే్‌షగౌడ్‌, మోయిన్‌, ద్వారక పాల్గొన్నారు.


కౌతాళం: విద్యుత్‌ చార్జీలను తగ్గించాలని జనసేన నాయకులు యాకోబురాజు, గురువినోద్‌, నరసింహ, మురారి డిమాండ్‌ చేశారు. శుక్రవారం కౌతాళంలో ఆందోళన నిర్వహించారు. ప్రభుత్యం భూములు అమ్మడానికి అనుమతించిన జీవోను రద్దుచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-05-23T10:21:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising