25 గొర్రె పిల్లలు..
ABN, First Publish Date - 2020-12-20T05:30:00+05:30
రుద్రవరం సమీపంలో ఆదివారం గొర్రె పిల్లల దొడ్డిపై కుక్కలు దాడి చేశాయి. రుద్రవరం గ్రామానికి చెందిన పెద్దన్నకు చెందిన 25 గొర్రె పిల్లలు మృతి చెందాయి.
- కుక్కల దాడిలో మృతి
- 10 మూగజీవాలకు తీవ్ర గాయాలు
రుద్రవరం, డిసెంబరు 20: రుద్రవరం సమీపంలో ఆదివారం గొర్రె పిల్లల దొడ్డిపై కుక్కలు దాడి చేశాయి. రుద్రవరం గ్రామానికి చెందిన పెద్దన్నకు చెందిన 25 గొర్రె పిల్లలు మృతి చెందాయి. అలాగే మరో 10 గొర్రె పిల్లలు తీవ్రంగా గాయపడ్డాయి. పశువైద్యాధికారి మనోరంజన్‌ప్రతాప్ ఘటనా స్థలానికి వెళ్లి మృతి చెందిన గొర్రె పిల్లలను పరిశీలించారు. గాయపడిన గొర్రె పిల్లలకు వైద్యం అందించారు.
Updated Date - 2020-12-20T05:30:00+05:30 IST