ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డోన్‌లో 47 కేసులు..

ABN, First Publish Date - 2020-07-06T15:18:41+05:30

జిల్లాలో కొవిడ్‌ బారిన పడినవారిలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐదు మరణాలు

97 కొత్త కేసులు

డోన్‌లో 47..


కర్నూలు(ఆంధ్రజ్యోతి‌): జిల్లాలో కొవిడ్‌ బారిన పడినవారిలో మరో ఐదుగురు మృతి చెందారు. మరణాల సంఖ్య 81కి చేరింది. తాజా హెల్త్‌ బులెటిన్‌ ప్రకారం 97 మందికి కొవిడ్‌ సోకింది. మొత్తం బాధితుల సంఖ్య 2,451కు చేరింది. 1,153 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 1,217 మంది డిశ్చార్జి అయ్యారు. ఆదివారం 1,02,174  శాంపిల్స్‌ సేకరించినట్లు కలెక్టర్‌ వీరపాండియన్‌ తెలిపారు. వైద్యులు, సిబ్బందిని అభినందించారు. కొత్త కేసుల్లో ఆదోని కార్వన్‌పేట, కంచగారి వీధి, విక్టోరియా పేట, క్రాంతినగర్‌లో ఒక్కో కేసు నమోదయ్యాయి. 


డోన్‌లో 47 కేసులు

డోన్ పట్టణంలో ఆదివారం 47 పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ కేఎల్‌ఎన్‌ రెడ్డి తెలిపారు. ఒక జాబితాలో 11, రెండవ జాబితాలో 18, మూడో జాబితాలో 12, నాలుగో జాబితాలో 6 పాజిటివ్‌ కేసులు వచ్చినట్లు తెలిపారు. మొత్తం కేసులు 78కి చేరినట్లు కమిషనర్‌ తెలిపారు. 


కొవిడ్‌ సెంటర్‌లో ఆకలి బాధలు

కర్నూలు స్టేట్‌ కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారు ఆకలి బాధలు పడుతున్నారు. వేళకు ఆహారం అందించడం లేదని బాధితులు వాపోతున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నరేంద్రనాథ్‌ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం ఆసుపత్రిలో పౌష్టికాహారాన్ని తనిఖీ చేశారు. తమకు చపాతీలు అందడం లేదని పెయింగ్‌ బ్లాక్‌ ఐసోలేషన్‌ వార్డులో కొందరు ఆయనకు ఫిర్యాదు చేశారు.


రెండో మెడికల్‌ వార్డులో భోజనంలో ఉప్పు తక్కువగా ఉందని ఫిర్యాదు చేశారు. సరైన ఆహారం అందించాలని డైట్‌ కాంట్రాక్టరును సూపరింటెండెంట్‌ ఆదేశించారు. ఉదయం పాలు, మధ్యాహ్నం, రాత్రి ఉడికించిన గుడ్లు ఇవ్వాలని, నాణ్యమైన భోజనం పెట్టాలని ఆదేశించారు. ఒక్కొక్కరికి రోజుకు 4 వాటర్‌ బాటిళ్లను అందజేయాలని సూచించారు.   

Updated Date - 2020-07-06T15:18:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising