సమన్వయంతో పని చేద్దాం
ABN, First Publish Date - 2020-11-14T05:16:46+05:30
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయా లని, అప్పుడే జిల్లా అభివృద్ధి సాధ్యమని కర్నూలు ఎంపీ డా.సంజీవ్‌కుమార్ అన్నారు.
- దిశా సమావేశంలో కర్నూలు, నంద్యాల ఎంపీలు
కర్నూలు, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయా లని, అప్పుడే జిల్లా అభివృద్ధి సాధ్యమని కర్నూలు ఎంపీ డా.సంజీవ్‌కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో జిల్లా దిశా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కర్నూలు, నంద్యాల ఎంపీలు డా.సంజీవకుమార్, పోచా బ్రహ్మానందరెడ్డి, పాణ్యం, కోడుమూరు ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, డా.జె.సుధాకర్, కలెక్టర్ వీరపాండియన్, జాయింట్ కలెక్టర్లు రాంసుందర్ రెడ్డి, సయ్యద్ ఖాజా మొహిద్దీన్, కమిషనర్ డీకే బాలాజి, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీలు డా. సంజీవ్‌కుమార్, పోచా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి జిల్లాకు రావాల్సిన నిధులు రాబట్టడానికి కృషి చేస్తామన్నారు. కూలీలు వలస వెళ్లకుండా ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. నేషనల్ హైవే గుత్తి పెట్రోల్ బంకు, వెంకటరమణ కాలనీ హైవే ప్లైఓవర్ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ఎమ్మెల్యేలు కాటసాని, డా.జె సుధాకర్ మాట్లాడారు. కలెక్టర్ వీరపాండియన్ మాట్లాడుతూ దిశా సమీక్షలో ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాచారం అందించడంతో పాటు ప్రపోజల్స్ ప్రభుత్వానికి పంపేలా చర్యలు చేపడుతామన్నారు.
Updated Date - 2020-11-14T05:16:46+05:30 IST