ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీర యోధుడు గులాం రసూల్‌ ఖాన్‌

ABN, First Publish Date - 2020-07-13T11:48:24+05:30

బ్రిటీష్‌ వ్యతిరేక పోరాట యోధుడు గులాం రసూల్‌ ఖాన్‌ స్ఫూర్తి ఎప్పటికీ నిలిచి ఉంటుందని నంద్యాల పార్లమెంట్‌ డీసీసీ అధ్యక్షుడు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వర్ధంతి సభలో నంద్యాల డీసీసీ అధ్యక్షుడు లక్ష్మీనరసింహ యాదవ్‌  



కర్నూలు(అర్బన్‌), జూలై 12: బ్రిటీష్‌ వ్యతిరేక పోరాట యోధుడు  గులాం రసూల్‌ ఖాన్‌ స్ఫూర్తి ఎప్పటికీ నిలిచి ఉంటుందని నంద్యాల పార్లమెంట్‌ డీసీసీ అధ్యక్షుడు లక్ష్మీనరసింహ యాదవ్‌ అన్నారు. ఆదివారం నంద్యాల చెక్‌ పోస్టు సమీపంలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో గులాం రసూల్‌ ఖాన్‌ 180వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ   1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటుకు పూర్వమే రసూల్‌ఖాన్‌ బ్రిటీష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడని అన్నారు. 1839 సెప్టెంబర్‌లో  జొహరాపురం వద్ద జరిగిన యుద్ధంలో  గులాం రసూల్‌ ఖాన్‌ను బ్రిటీష్‌ సేనలు పట్టుకొని  తమిళనాడులోని తిరుచునాపల్లిలో 1840 జూలై 12న హత్య చేశారని అన్నారు.  


 ఓర్వకల్లు విమానాశ్రయానికి రసూల్‌ ఖాన్‌ పేరు పెట్టాలి:

గులాం రసూల్‌ ఖాన్‌ పేరు ఓర్వకల్లు విమానాశ్రయానికి పెట్టాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కుల ఐక్య వేదిక నాయకురాలు పట్నం రాజేశ్వరి కోరారు.   ఆదివారం కర్నూలులోని సంస్థ కార్యాలయంలో గులాం రసూల్‌ఖాన్‌  వర్ధంతి సభ నిర్వహించారు.   


కర్నూలు(కల్చరల్‌): స్వాతంత్య్ర సమరయోధుడు, కర్నూలు చివరి నవాబు గులాం రసూల్‌ఖాన్‌ పేరును ఓర్వకల్లు విమానాశ్రయానికి పెట్టాలని కర్నూలుకు చెందిన నవలా రచయిత ఎస్‌డీవీ అజీజ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం రసూల్‌ఖాన్‌ 180వ వర్ధంతిని  హౌసింగ్‌ బోర్డులోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళా ఐక్యవేదిక కార్యాలయంలో నిర్వహించారు.  

Updated Date - 2020-07-13T11:48:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising