ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జొన్నకు కత్తెర పురుగు

ABN, First Publish Date - 2020-11-19T05:12:14+05:30

జొన్న పంటను కత్తెర పురుగు ఆశించింది.

కత్తెర పురుగుతో దెబ్బతిన్న జొన్న పంట
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. ఆందోళనలో రైతులు 

చాగలమర్రి, నవంబరు 18: జొన్న పంటను కత్తెర పురుగు ఆశించింది. గత ఏడాది ఈ పురుగు వల్లే ఆశించిన దిగుబడి రాలేదు. ఈసారి కూడా అదే పురుగు మళ్లీ పంటను తినేస్తోంది. ఈ పురుగును ఆకులు పూర్తిగా తినేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు నగల్లపాడు, మల్లేవేముల, గొట్లూరు, బ్రాహ్మణపల్లె, నేలంపాడు, మద్దూరు తదితర గ్రామాల్లో 5 వేల ఎకరాలకుపైగా జొన్న పంట సాగు చేశారు. గత ఏడాది ధర అధికంగా ఉండటంతో ఈ ఏడాది కూడా సాగు చేశారు. అయితే కత్తెర పురుగు పంటను నలిపేస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 


తెగుళ్ల వల్ల నష్టపోతున్నాం

జొన్న పంటకు కత్తెర పురుగు సోకి నష్టపోతున్నాం. అధిక దిగుబడి సాధించవచ్చని జొన్న పంట సాగు చేస్తే భారీ వర్షాల వల్ల పంటకు తెగులు సోకింది. ఎన్ని మందులు వాడినా  పురుగు చావడం లేదు. తెగుళ్ల నుంచి పంటను కాపాడాలి. -రాముడు రైతు, నగల్లపాడు  


మందులు పిచికారి చేయాలి

కత్తెర పురుగును అరికట్టడానికి వ్యవసాయశాఖ సూచనలు పాటించాలి. కత్తెర పురుగు నివారణ కోసం కొరాజిన్‌, కాలార్మి లీటర్‌ నీటిలో 3 ఎంఎల్‌ మందు వేసి పంట బాగా తడిసేలా పిచికారి చేయాలి. పంట సాగుకు ముందే విత్తనశుద్ధి చేస్తే తెగుళ్లు దూరమవుతాయి. -నహిదాబాను, ఏవో, చాగలమర్రి 


Updated Date - 2020-11-19T05:12:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising