ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా దెబ్బతో కుదేలైన జామ రైతు

ABN, First Publish Date - 2020-03-27T10:28:22+05:30

మండలంలో కరోనా దెబ్బతో జామ, అరటి, బొప్పాయి, పూల తోట రైతు కుదేలయ్యారు. రైతులు సాగు చేసిన పండ్లతోటలకు రవాణా సౌకర్యాలు నిలిపివేయడంతో మార్కెటింగ్‌ చేసుకోలేక ఆందోళన చెందు తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రవాణా, మార్కెటింగ్‌ లేక ఆందోళన 

రూ.5 లక్షలు నష్టం 


చాగలమర్రి, మార్చి 26: మండలంలో కరోనా దెబ్బతో జామ, అరటి, బొప్పాయి, పూల తోట రైతు కుదేలయ్యారు. రైతులు సాగు చేసిన పండ్లతోటలకు రవాణా సౌకర్యాలు నిలిపివేయడంతో మార్కెటింగ్‌ చేసుకోలేక ఆందోళన చెందు తున్నారు. శెట్టివీడు గ్రామ సమీపంలో చాగలమర్రికి చెందిన రైతు ఉల్లి రమేష్‌ రెండేళ్ల నుంచి తైవాన్‌పింక్‌ జామ పంట సాగు చేస్తున్నాడు. 2019లో సుమారు 18 టన్నుల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది పంట విరగ కాచింది. రైతు సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. కరోనా వైరస్‌ ప్రభావంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించాయి. దీంతో రవాణా నిలిచిపోయింది. తైవాన్‌ జామ పంట దిగుబడి ఉన్నా అమ్ము కోవడానికి వీలు లేకపోయింది. మార్కెట్‌లో ప్రస్తుతం 25 కేజీల తైవాన్‌ జామ సుమారు రూ.500 నుంచి రూ.600 దాకా ధర పలుకుతోంది. విక్రయించడానికి వీలు లేక పోవ డంతో పొలంలోనే జామ కాయలను కుప్పగా పోసి వది లేశారు. రూ.5 లక్షల దాకా నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ఆదుకోవాలని రైతు కోరుతున్నారు. 


ప్రభుత్వం ఆదుకోవాలి.. ఉల్లి రమేష్‌, రైతు, చాగలమర్రి

కరోనా వైరస్‌ ప్రభావం వల్ల రవాణా నిలిచిపోయింది. మార్కెటింగ్‌ లేక పండిన తైవాన్‌ జామ అమ్ముకోలేక పార వేయాల్సి వచ్చింది. రూ.5 లక్షలు నష్టం వాటిల్లింది. మార్కె టింగ్‌ సౌకర్యం కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలి.



Updated Date - 2020-03-27T10:28:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising