ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీటి ఎద్దడిపై కలెక్టర్‌కు ఫిర్యాదు

ABN, First Publish Date - 2020-05-17T09:57:49+05:30

ఆదోని మండలంలోని అనేక గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి ఎద్దడి గురించి కలెక్టర్‌ వీరపాండియన్‌కు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదోని టౌన్‌, మే 16: ఆదోని మండలంలోని అనేక గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి ఎద్దడి గురించి కలెక్టర్‌ వీరపాండియన్‌కు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు ప్రకా్‌షజైన్‌ శనివారం ఫిర్యాదు చేశారు. మండలంలోని పెద్దతుంబళం మేజర్‌ గ్రామ పంచాయతీలో ప్రజలకు ఫిల్టర్‌ కాని తాగునీటిని సరఫరా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఫిల్టర్‌కాని పచ్చరంగులోని తాగునీటినే ప్రజలు తాగాల్సిన దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాల్సిన అధికారులు కరోనా సాకుతో ఫిల్టర్‌కాని నీటినే సరఫరా చేయడం సమంజసం కాదన్నారు. నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న పెద్దతుంబలం గ్రామంతో పాటు పెసలబండ, బైచిగేరి, నెట్టేకల్లు, జీహొసల్లి, సంతెకుడ్లూరు గ్రామాల ప్రజలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేయాలని కలెక్టర్‌ను కోరినట్లు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్‌జైన్‌ తెలిపారు. 


Updated Date - 2020-05-17T09:57:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising