ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమ బదిలీలను రద్దు చేయాలి: యూటీఎఫ్‌

ABN, First Publish Date - 2020-07-13T11:47:17+05:30

నిబంధనలకు వ్యతిరేకంగా అధికార దుర్వి నియోగానికి పాల్పడి ఉపాధ్యాయులను అక్రమంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(ఎడ్యుకేషన్‌), జూలై 12: నిబంధనలకు వ్యతిరేకంగా అధికార దుర్వి నియోగానికి పాల్పడి ఉపాధ్యాయులను అక్రమంగా బదిలీ చేయడం తగదని, వాటిని రద్దు చేయాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి సురే్‌షకుమార్‌, రాష్ట్ర సహాధ్యక్షురాలు నాగమణి, జిల్లా అధ్యక్షుడు ఎల్లప్ప, ప్రధాన కార్యదర్శి సుధాకర్‌ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. బదిలీల ఫైళ్లు ఒక వైపు నడుస్తుండగానే గుట్టు చప్పుడు కాకుండా  ప్రభుత్వం అక్రమ బదిలీలకు తెర లేపిందని ఆరోపించారు. 


నంద్యాల (ఎడ్యుకేషన్‌): రాజకీయంగా పలుకుబడి ఉన్న ఉపాధ్యాయులకు కోరుకున్న స్థానాలకు బదిలీ చేశారని, వీటిని రద్దు చేయాలని యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి జాకీర్‌ హుసేన్‌ డిమాండ్‌ చేశారు. గత మూడేళ్లుగా ఉపాధ్యాయ బదిలీల కోసం ఎదురు చూస్తుండగా, ఇప్పుడు రాజకీయ పరపతి ఉన్న వాళ్లకు సచివాలయంలోనే బదిలీ ఉత్తర్వులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.  

ప్యాపిలి: నిబంధనలకు వ్యతిరేకంగా చేపట్టిన ఉపాధ్యాయ బదిలీలను రద్దు చేయాలని జిల్లా యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి అబ్దుల్‌ లతీఫ్‌, ఉపాధ్యక్షురాలు శాంతిప్రియ డిమాండ్‌ చేశారు. ఆదివారం వారు మాట్లాడుతూ అధికారులు పైరవీల ద్వారా బదిలీలు చేశారని ఆరోపించారు. 

Updated Date - 2020-07-13T11:47:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising