ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయాల్లో అక్రమార్కులు

ABN, First Publish Date - 2020-06-04T10:18:06+05:30

శ్రీశైలం, మహానంది ఆలయాల్లో హైందవ సంప్రదాయానికి గండి కొడుతున్నారని బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి


కర్నూలు(అర్బన్‌), జూన్‌ 3: శ్రీశైలం, మహానంది ఆలయాల్లో హైందవ సంప్రదాయానికి గండి కొడుతున్నారని బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరెడ్డి మండి పడ్డారు. నగరంలోని బైరెడ్డి ఫంక్షన్‌ హల్‌లో బుధవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీల కారణంగా పవిత్ర ఆలయాల్లో అక్రమార్కులు చొరబడ్డారని, రూ.కోట్ల విలువైన సొమ్ము దోచుకుని వెళ్లిపోతున్నారని అన్నారు. అలాంటి వారిని అధికార పార్టీ నాయకులు కాపాడుతున్నారని ఆరోపించారు. అ క్రమాలను ప్రశ్నించిన తనను శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు చేసుకుంటున్న శిల్పాను రాజకీయాల్లో తీసుకువచ్చానని, ఆయన స్థాయి మరిచి మాట్లాడటం పద్ధతి కాదని అన్నారు. తన ఆరోపణలపై సీఎం జగన్‌ స్పందించాలని, లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో మహనంది నుంచి శ్రీశైలానికి రథయాత్ర నిర్వహిస్తామని హెచ్చరించారు.


అక్కడ జరుగుతున్న ఆక్రమాలను ప్రపంచానికి తెలిసేలా చేస్తామని అన్నారు. 2017 వరకు  మహానంది ఆలయాలనికి ఏటా రూ.20 కోట్ల ఆదాయం ఉంటే, ఆ తర్వాత ఏడాది నుంచి రూ.7 కోట్లకు ఎందుకు పడి పొయిందో చెప్పాలని ప్రశ్నించారు. దేవస్థానం భూముల్లో 126 ఎరకాలు అన్యాక్రాంతం అయ్యాయని, 116 ఎకరాలను నాయకులే తమ అనుచరులకు కట్టబెట్టి అరటి తోటలు  సాగు చేయిస్తున్నారని విమర్శించారు. అక్రమాలను వెలుగులోకి తెచ్చి శైవ క్షేత్రాలను కాపాడుకుంటామని తెలిపారు. 


Updated Date - 2020-06-04T10:18:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising