ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసెంబ్లీ రద్దుకు సిద్ధమా?: బీవీ

ABN, First Publish Date - 2020-08-08T09:49:08+05:30

అసెంబ్లీ రద్దుకు వైసీపీ సిద్ధమా? అని మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి సవాల్‌ విసిరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 జగన్‌ది తుగ్లక్‌ పాలన 

భవిష్యత్తును నాశనం చేశారు 


ఎమ్మిగనూరు టౌన్‌, ఆగస్టు 7: అసెంబ్లీ రద్దుకు వైసీపీ సిద్ధమా? అని మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి సవాల్‌ విసిరారు. శుక్రవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. అంతకుముందు చేనేత దినోత్సవం సందర్భంగా మాచాని సోమప్ప, మాజీ మంత్రి బీవీ మోహన్‌రెడ్డి చిత్రపటాలకు నివాళి అర్పించారు. నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని అసెంబ్లీ సాక్షిగా  నాటి సీఎం  చంద్రబాబు ప్రకటించారని అన్నారు. ప్రఽధాని నరేంద్రమోదీ పార్లమెంట్‌ సాక్షిగా మట్టి, నీరుతో జీవం పోసుకున్న అమరావతిని నాశనం చేశారని అన్నారు. స్వార్థ ప్రయోజనాలకు రాష్ట్రాన్ని బలిచేసి మూడు ముక్కలుగా విడగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. 


5కోట్ల ప్రజలు, భావితరాల భవిష్యత్తును కాలరాశారని సీఎం జగన్‌పై మండిపడ్డారు. జగన్‌ తుగ్లక్‌ పాలనను గుర్తుచేస్తున్నారని, పజల జీవితాలతో ఆడుకునే హక్కు వైసీపీ ఎక్కడిదన్నారు. రాజధాని అంశంలో చంద్రబాబు విసిరిన 48గంటల సవాల్‌ను వైసీపీ ఎందుకు స్వీకరించలేదని ప్రశ్నించారు. ఎమ్మిగ నూరు ఎమ్మెల్యేగా తాను సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు చేయించానని, ఉల్లికి గిట్టుబాటుఽ ధర కల్పించానని అన్నారు. అయితే  రైతులకు పంటను అమ్ముకునే దిక్కులేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-08-08T09:49:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising