ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బనవాసిలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలి

ABN, First Publish Date - 2020-11-28T04:43:37+05:30

రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మిగనూరు బనవాసిలో మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి డిమాండ్‌ చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. జగనన్న తోడు బూటకం  
  2. యూజీడీ ఎందుకు పూర్తి చేయలేదు? 
  3. మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి 


ఎమ్మిగనూరు, నవంబరు 27: రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మిగనూరు బనవాసిలో మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఎమ్మిగనూరులో  విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మెడికల్‌ కాలేజీని ఆదోనిలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోందని, అక్కడ భూములు కొనే బదులు, బనవాసి అటవీ ప్రాంతంలో ప్రభుత్వ భూముల్లో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కృషిచేయాలని సూచించారు. ఇప్పటికే తాను వెటర్నరీ పాలిటెక్నిక్‌ కళాశాలతో పాటు ఇతర విద్యాసంస్థలు ఏర్పాటు చేయించానని, మెడికల్‌ కాలేజీ ఏర్పాటు అయితే బనవాసి ఎడ్యుకేషన్‌ హబ్‌గా అబివృద్ధి చెందుతుఉందని అన్నారు. విద్యా, వైద్యాభివృద్ధికి ఎవరు కృషి చేశారో ప్రజలకు తెలుసన్నారు. ఎమ్మిగనూరు ప్రభుత్వాసుత్రిని 50 పడకల నుంచి 100 పడకల పెంపుకు తమ హయాంలో నిధులు మంజూరయ్యాయన్నారు. వైసీపీ ప్రభుత్వం వైద్యాభివృద్ధికి కొత్తగా చేసేందేమీ లేదన్నారు. ఆసుపత్రి కొత్తభవనాలకు 18నెలల తరువాత పనులు ప్రారంభించటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న తోడు బూటకమని, బ్యాంకర్లకు ప్రభుత్వం పూచికత్తు ఉండి రుణాలు ఇప్పించాల్సింది పోయి నేరుగా చిరువ్యాపారులకు ఇప్పించి, బాధ్యతను తప్పించుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఎమ్మిగనూరు పట్టణంలో భూగర్భ డ్రైనేజీ పనులు ఇంకా పూర్తికాకపోవటం ప్రభుత్వ నిర్లక్షానికి నిదర్శనమని విమర్శించారు.

 

ఎన్టీఆర్‌ ఘాట్‌ జోలికొస్తే సహించేది లేదు

హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ ఘాట్‌ జోలికొస్తే సహించేది లేదని బీవీ  హెచ్చరించారు. ఎన్టీఆర్‌ ఓ ప్రాంతం, వర్గానికి చెందిన నాయకుడు కాదన్నారు. ఎన్నికల్లో మీరు చెయాల్సింది చెప్పాలేకాని, ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి లబ్ధిపొందాని చూస్తే సహించేది లేదన్నారు. నాగేశ్‌ ఆచారి, బజారి, క్యాబర్సి శ్రీనివాసులు, సోమన్న పాల్గొన్నారు.

Updated Date - 2020-11-28T04:43:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising