ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్డు ద్వారా కొనుగోళ్లు చేస్తున్నారా?

ABN, First Publish Date - 2020-08-08T09:48:29+05:30

క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారా కొనుగోళ్లు చేస్తున్న వారు తమ పిన్‌ (పర్సనల్‌ ఐడెంటి ఫికేషన్‌ నెంబర్‌)ను తరచూ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తరచూ పిన్‌ మార్చండి 

ఎస్పీ ఫక్కీరప్ప


కర్నూలు, ఆగస్టు 7: క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారా కొనుగోళ్లు చేస్తున్న వారు తమ పిన్‌ (పర్సనల్‌ ఐడెంటి ఫికేషన్‌ నెంబర్‌)ను తరచూ మారుస్తుండాలని ఎస్పీ ఫక్కీరప్ప సూచించారు. శుక్రవారం సైబర్‌ అలర్ట్‌ విడుదల చేశారు. ఇటీవల సైబర్‌ నేరస్థులు ఏటీఎం క్రెడిట్‌, డెబిట్‌ కార్డును క్లోనింగ్‌ చేసి నగదు కాజేస్తున్నారన్నారు. తమ బ్యాంకు ఖాతాకు ఆధార్‌ కార్డు లింక్‌ అయిందో లేదో సరిచూసుకోవాలని సూచించారు. నమ్మకమైన దుకాణా ల్లోనే కార్డును స్వైప్‌ చేయాలని అన్నారు. కొందరు సైబర్‌ నేరస్థులు కార్డును క్లోనింగ్‌ చేసి రూ.లక్ష వరకు నగదు కాజేసినట్లు ఫిర్యాదులు అందాయని అన్నారు.


తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

ఏటీఎం కార్డులను స్వైప్‌ చేసే సమయంలో షాపు యజమానులను గమనించాలి. పిన్‌ నెంబరును తరుచుగా మారుస్తూ ఉండాలి. పిన్‌ వివరాలు, కార్డు వివరాలు గోప్యంగా ఉంచుకోవాలి. నకిలీ వెబ్‌సైట్‌లను నమ్మవద్దు. కార్డుపై వ్యక్తిగత వివరాలను నమోదు చేయకూడదు. బ్యాంకు ఖాతా, కార్డు, ఓటీపీ వివరాలు గోప్యంగా 

ఉంచుకోవాలి. ఏమైనా సమస్యలు, సందేహాలుంటే పోలీ్‌సస్టేషన్‌, సైబర్‌ ల్యాబ్‌ పోలీసులకు గానీ, సైబర్‌ మిత్ర వాట్సా్‌ప నెంబరు 9121211100ను సంప్రదించాలి.

Updated Date - 2020-08-08T09:48:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising