ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో ఐదు కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-06-05T11:02:47+05:30

జిల్లాలో కరోనా కేసులు అమాంతం పెరుగుతున్నాయి. గురువారం జిల్లాలో మరో ఐదుగురికి వైరస్‌ సోకినట్లు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అన్నీ కర్నూలు నగరంలోనే..

743కు చేరిన బాధితులు

ఆదోనిలో ఓ ఆర్‌ఎంపీ మృతి


కర్నూలు(హాస్పిటల్‌), జూన్‌ 4: జిల్లాలో కరోనా కేసులు అమాంతం పెరుగుతున్నాయి. గురువారం జిల్లాలో మరో ఐదుగురికి వైరస్‌ సోకినట్లు అధికారులు ధ్రువీకరించారు. వీరిలో నగరంలోని వన్‌టౌన్‌లో నలుగురు, రోజావీధిలో ఒకరు ఉన్నారు. దీంతో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 743కు చేరింది. ఆదోని పట్టణంలో కరోనా పాజిటివ్‌తో ఓ ఆర్‌ఎంపీ మృతి చెందడం కలకలం రేపింది. ఇప్పటివరకు కరోనా వైరస్‌తో మృతి చెందిన వారి సంఖ్య 27కు చేరింది. కర్నూలు నగరంలోనే అత్యధికంగా మరణాలు సంభవించాయి. 


ఏడుగురు డిశ్చార్జి

జిల్లాలో మరో ఏడుగురు కరోనాను జయించారు. కర్నూలు జీజీహెచ్‌ స్టేట్‌ కొవిడ్‌ ఆసుపత్రి నుంచి ముగ్గురు, నంద్యాల శాంతిరాం జిల్లా స్థాయి ప్రభుత్వ కొవిడ్‌ ఆసుపత్రి నుంచి నలుగురు డిశ్చార్జి అయ్యారు. వీరిలో 80 ఏళ్ల వృద్ధురాలు ఉన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 637 మంది డిశ్చార్జి అయ్యారు. 

Updated Date - 2020-06-05T11:02:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising