మరో 919 కేసులు
ABN, First Publish Date - 2020-08-22T10:08:10+05:30
జిల్లాలో శుక్రవారం 919 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 37,300కు చేరింది. వీరిలో 7040 మంది చికిత్స పొం
37,300కు చేరిన కేసుల సంఖ్య
ముగ్గురి మృతి
కర్నూలు(హాస్పిటల్), ఆగస్టు 21: జిల్లాలో శుక్రవారం 919 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 37,300కు చేరింది. వీరిలో 7040 మంది చికిత్స పొందుతుండగా, 29,943 మంది డిశ్చార్జి అయ్యారు. చికిత్స పొందుతూ శుక్రవారం ముగ్గురు మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 317కు చేరింది.
జిల్లా ఎయిడ్స్ అండ్ లెప్రసీ నివారణ విభాగంలో పని చేస్తున్న ఓ అధికారి కరోనా పాజిటివ్‌తో చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృతిచెందారు. ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో 22 మంది కరోనా బారినపడ్డారు. ఓర్వకల్లు మండలం హుశేనాపురం గ్రామంలో 13 మంది పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
Updated Date - 2020-08-22T10:08:10+05:30 IST