ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రమాదకరంగా అంతిమ యాత్ర.. శ్మశానానికి దారిలేకపోవడంతో..

ABN, First Publish Date - 2020-09-29T18:23:42+05:30

‘రైలు పట్టాలపై ఇంత జనం ఎందుకు ఉన్నారు..? మృత దేహాన్ని ఇలా పట్టాల..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదోని(కర్నూలు): ‘రైలు పట్టాలపై ఇంత జనం ఎందుకు ఉన్నారు..? మృత దేహాన్ని ఇలా పట్టాల మీదుగా ఎందుకు తీసుకుపోతున్నారు..? వేరే దారిలో వెళ్లొచ్చు కదా అని అనుకుం టున్నారా..?’ వారికి వేరే దారి లేదు. ఎవరైనా చనిపోతే అంతిమ యాత్ర ఇలా ప్రమాదకరంగా ఉంటుంది. దాదాపు అర కిలోమీటరు ఇలా రైలు పట్టాలపై నడవాల్సిందే. ఆదోని మండలంలోని గణేకల్లు గ్రామస్థులు కొన్నేళ్లుగా ఇలా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి చెందిన బసవన్న (65) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందాడు. బంధు మిత్రులు, కుటుంబ సభ్యులు సోమవారం అంత్య క్రియలు నిర్వహించారు. ఆ ఊరి శ్మశాన వాటికకు వెళ్లాంటే ఇలా రైలు పట్టాలపై నడవాల్సిందే. ఇలా వెళ్లే సమయంలో చాల మంది ప్రమాదానికి గురయ్యారు. సమస్యను పరిష్కరించాలని అధికారులు, ప్రజాప్రతి నిధుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకో వడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. 


ఆదోని మండల పరిధిలోని గణేకల్లులో సుమారు 700 కుటుంబాలు ఉంటాయి. గ్రామ జనాభా 3 వేలకు పైగానే ఉంటుంది. ఎన్నికల సమయంలో తప్ప నాయకులు ఎవరూ తమ వద్దకు రావడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్మశానానికి రహదారి వేయిస్తామని పలువురు హామీ ఇచ్చారని, కానీ ఏ ఒక్కరూ నెరవేర్చలేదని వాపోతున్నారు.



Updated Date - 2020-09-29T18:23:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising