రూ.1600 కోట్లతో వేదవతి ప్రాజెక్టు: మంత్రి
ABN, First Publish Date - 2020-12-11T05:36:19+05:30
వేదవతి ప్రాజెక్టు నిర్మిణానికి రూ.1600 కోట్లతో ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి గుమ్మనూరు జయరాం గురువారం తెలిపారు.
ఆలూరు, డిసెంబరు 10: వేదవతి ప్రాజెక్టు నిర్మిణానికి రూ.1600 కోట్లతో ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి గుమ్మనూరు జయరాం గురువారం తెలిపారు. ఆలూరు మండలంలో 22 వేల ఎకరాలు, హాలహర్వి మండలంలో 8,035 ఎకరాలు, హొళగుంద మం డలంలో 24.23 వేల ఎకరాలు, చిప్ప గిరి మండలంలోని 15,565 ఎకరాలు, ఆదోని పరిధిలో 20.97వేల ఎకరాలకు మొత్తం 80 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ప్రాజెక్టు నిర్మాణానికి శుక్రవారం నెట్రవట్టి వద్ద పైపులైన్ పనులకు భూమి పూజ చేస్తున్నట్లు తెలిపారు. మెగా ఇంజినీరింగ్ కంపెనీ పనులను చేపడుతోందని మంత్రి అన్నారు.
Updated Date - 2020-12-11T05:36:19+05:30 IST