స్పీకర్ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారు: కూన
ABN, First Publish Date - 2020-09-14T21:02:10+05:30
సోమేశ్వరరావు అనే వ్యక్తి నకిలీ ఐడీలు క్రియేట్ చేసి అసెంబ్లీ, సెక్రటేరియట్‌లో తిరుగుతూ..
అమరావతి: సోమేశ్వరరావు అనే వ్యక్తి నకిలీ ఐడీలు క్రియేట్ చేసి అసెంబ్లీ, సెక్రటేరియట్‌లో తిరుగుతూ.. స్పీకర్ పేరు చెప్పుకుని అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేత, కూన రవికుమార్ అన్నారు. అయితే సోమేశ్వరరావు అనే వ్యక్తి ఎవరో తెలియదని, స్పీకర్‌కు అతనికి ఎటువంటి సంబంధం లేదని అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు చెప్పడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. సోమేశ్వరరావు ఎవరో తెలియనప్పుడు ఆయన ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి తిరుగుతుంటే ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని రవికుమార్ ప్రశ్నించారు.
సోమేశ్వరరావు అనే వ్యక్తి ద్వారా స్పీకర్ తమ్మినేని సీతారాం.. అసెంబ్లీ, సెక్రటేరియట్‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు వేయిస్తామని చెప్పి సోమేశ్వరరావు ద్వారా డబ్బులు వసూలు చేశారని ప్రజలు మాట్లాడుతున్నారని రవికుమార్ అన్నారు. దీనికి సంబంధించిన ఆడియోను కూన రవికుమార్ మీడియా ముందుంచారు. మరిన్ని వివరాల కోసం పై వీడియో క్లిక్ చేయండి..
Updated Date - 2020-09-14T21:02:10+05:30 IST