వెంపటి సేవలు అజరామరం
ABN, First Publish Date - 2020-03-16T09:45:37+05:30
కూచిపూడి నృత్యానికి వెంపటి చినసత్యం ఒక శతాబ్దానికి చాలినంత సేవ చేశారని, కూచిపూడి నాట్య సంప్రదాయ శైలిని కాపాడే బాధ్యతను ఆయన వారసులు సమర్ధవంతంగా నిర్వహించే శక్తి నటరాజస్వామి వారికి
- ‘కూచిపూడి రత్న’ ప్రదానోత్సవంలో పట్రాయని సంగీతరావు
చెన్నై, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): కూచిపూడి నృత్యానికి వెంపటి చినసత్యం ఒక శతాబ్దానికి చాలినంత సేవ చేశారని, కూచిపూడి నాట్య సంప్రదాయ శైలిని కాపాడే బాధ్యతను ఆయన వారసులు సమర్ధవంతంగా నిర్వహించే శక్తి నటరాజస్వామి వారికి కల్పించాలని తెలుగు సంగీత దిగ్గజం పట్రాయని సంగీతరావు ఆకాంక్షించారు. శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు కూచిపూడి ఆర్ట్ అకాడమీ తరపున ఆదివారం రాత్రి చెన్నైలో ‘కూచిపూడి రత్న’ బిరుదును ప్రదానం చేసి, గండపెండేరం తొడిగి, కనకాభిషేకం చేశారు. దివంగత వెంపటి చినసత్యం స్థాపించిన ఈ అకాడమీ ప్రాంగణంలో ఆయన కుమారుడు వెంకట్ వెంపటి సారథ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తమిళనాడు ఎమ్మెల్యే ఆర్.నటరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని సంగీతరావుకి బిరుదును ప్రదానం చేశారు. వయోభారం దృష్ట్యా సంగీతరావు మనసులోని భావాలను ఆమె కుమార్తె, ప్రముఖ రచయిత్రి కేవీ రమణమ్మ వెల్లడించారు. సంప్రదాయ కూచిపూడి నాట్యాన్ని మద్రాసులో నిలబెట్టాలన్న వెంపటి చినసత్యం సేవ అపూర్వమైనదని, తనను వైణికుడిగా, సంగీత దర్శకుడిగా చినసత్యమే పరిచయం చేశారని చెప్పారు.
Updated Date - 2020-03-16T09:45:37+05:30 IST