ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పిరిట్ చావులకు పెరిగిన మద్యం ధరలే కారణం: కేఎస్ జవహర్

ABN, First Publish Date - 2020-06-01T21:40:37+05:30

అమరావతి: స్పిరిట్ చావులకు పెరిగిన మద్యం ధరలే కారణమని టీడీపీ నేత కేఎస్ జవహర్ వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: స్పిరిట్ చావులకు పెరిగిన మద్యం ధరలే కారణమని టీడీపీ నేత కేఎస్ జవహర్ వ్యాఖ్యానించారు. కశింకోట మరణాలకు సీఎం జగన్ బాధ్యత వహించాలన్నారు. రాష్ట్రంలో మద్య నిషేధం పేరుతో మద్యం ధరలను 75శాతం ధరలు పెంచి దోచుకున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. దశలవారీ మద్యపాన నిషేధం పేరుతో.. దశల వారీగా ప్రజల ప్రాణాలు తీస్తున్నారని విమర్శించారు.


లాక్ డౌన్ సమయంలోనూ మద్యం దుకాణాలు తెరిపించి ప్రజలకు కరోనా వ్యాపింపజేశారన్నారు. లాక్ డౌన్ సమయంలో ప్రశాంతంగా ఉన్న కుటుంబాల్లో మద్యం చిచ్చు పెట్టారని జవహర్ విమర్శించారు. రాష్ట్రంలో అత్యాచారాలు, అకృత్యాలు పెరిగేందుకు కారణమయ్యారని... ప్రభుత్వ ఆదాయం కోసం మధ్యం ధరల్ని పెంచి ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారన్నారు. జే ట్యాక్స్ కోసం పేద, మధ్య తరగతి ప్రజలు నాటుసారా, గుడుంబా, స్పిరిట్ వంటి వాటికి బానిసల్ని చేస్తున్నారన్నారు. జగన్ రెడ్డి కక్కుర్తికి బలైన వారి కుటుంబ సభ్యులకు ఆయనే సమాధానం చెప్పాలని జవహర్ డిమాండ్ చేశారు.


Updated Date - 2020-06-01T21:40:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising