ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రక్రియ యథాతథంగా నిలిపివేత: కలెక్టర్‌

ABN, First Publish Date - 2020-03-16T10:39:07+05:30

ప్రక్రియ యథాతథంగా నిలిపివేత: కలెక్టర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(ఆంధ్రజ్యోతి, విజయవాడ): 

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియను యథాతథంగా నిలిపివేస్తున్నట్టు కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు. ప్రస్తుతం నిలిపివేసిన ఎన్నికల ప్రక్రియను మరలా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చాక అదే దశ నుంచి కొనసాగిస్తామన్నారు. అదివారం రాత్రి జిల్లలో ఎన్నికల నిలిపివేతకు సంబంధించిన వివరాలను పత్రికలకు ఆయన విడుదల చేశారు.


ఎలాంటి సమస్యలు వచ్చినా..

తిరిగి ఎన్నికలు నిర్వహించే వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎలాంటి సమస్యలు వచ్చినా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌రూమ్‌ను సంప్రందించాలని ఆయన సూచించారు. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లోని 9490800643, 9492219290 ఫోన్‌ నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. శాంతిభద్రతల సమస్యలపై పోలీస్‌ ఎలక్షన్‌ సెల్‌కు సమాచారం అందించాలన్నారు. 24 గంటలూ పనిచేసే పోలీస్‌ ఎలక్షన్‌ సెల్‌ నుంచి సహాయం పొందాలని ఆయన సూచించారు. పోలీస్‌ ఎలక్షన్‌ సెల్‌ ఫోన్‌ నెంబర్‌ (విజయవాడ) 9440627038, మచిలీపట్నం 7569043459కు సమాచారం అందించాలన్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన ఎన్నికల ప్రకియ్రలో ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల ఎన్నిక కొనసాగుతుందన్నారు. తిరిగి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించేంత వరకు జిల్లాలో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌  అమల్లో ఉంటుందని కలెక్టర్‌ ఇంతియాజ్‌ స్పష్టం చేశారు.

Updated Date - 2020-03-16T10:39:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising