ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీపీఎం అభ్యర్థులను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారు

ABN, First Publish Date - 2020-03-13T10:25:38+05:30

సీపీఎం అభ్యర్ధులను వైసీపీ నాయకులు అడుగడుగునా బెదిరిస్తున్నారని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వై. రఘు అన్నారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఎం జిల్లా కార్యదర్శి రఘు


మచిలీపట్నం టౌన్‌, మార్చి 12 : సీపీఎం అభ్యర్ధులను వైసీపీ నాయకులు అడుగడుగునా బెదిరిస్తున్నారని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వై. రఘు అన్నారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డారు. వైసీపీ నాయకుల అధికార దర్పంతో ప్రజా స్వామ్య పద్ధతులు విడనాడి ఇష్టారాజ్యంగా వ్యవహ రిస్తున్నారన్నారు. పెడనలో సీపీఎం నాయకులపై వైసీపీ నాయకులు దౌర్జన్యానికి దిగడం ఆ పార్టీ నేతల అధికారదర్పానికి పరాకాష్ట అన్నారు.  అధికార పార్టీకి చెందిన నాయకులు మెరకనపల్లిలో దళితుల భూములను ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చూస్తు న్నారని, అందుకు మోపిదేవి మండలం తహసీల్దార్‌ కూడా వత్తాసు పలుకుతున్నారన్నారు.


కొన్ని చోట్ల సీపీఎం నాయకులను ఎన్నికల్లో పాల్గొనవద్దని, ఏకగ్రీవంగా నిలబెడతామని వైసీపీ నాయకులు బెదిరించారన్నారు. వేసిన నామినేషన్లను ఉపసంహ రించుకోవాలని బెదిరిస్తున్నారన్నారు.  ఆర్థికబలం, అంగబలంతో వైసిపి నాయకులు ఇష్టారాజ్యంగా ఎన్నికల సమయంలో ప్రవర్తిస్తున్నారన్నారు. తొమ్మిది నెలల పాలనలోనే ఇలా వైసిపి నాయకులు అధికార దర్పం ప్రదర్శిస్తే రానున్న నాలుగేళ్ళలో ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నామన్నారు. పార్టీ నాయకుడు సిహెచ్‌. రవి మాట్లాడుతూ ప్రజా స్వామ్య విధానాలను కాపాడేందుకు అధికారులు ముందుకు రావాలన్నారు. 

Updated Date - 2020-03-13T10:25:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising