ఇదేం భజన..? దుర్గమ్మ సన్నిధిలో అధికార పార్టీ భజన
ABN, First Publish Date - 2020-10-03T17:38:19+05:30
దుర్గగుడి రానురానూ రాజకీయ కార్యక్రమాలకు వేదికగా మారిపోతోంది. ఆధ్యాత్మికతతో వెలగాల్సిన ఆలయ ప్రాంగణం కొంతకాలంగా రాజకీయ ఎత్తుగడల్లో మునిగిపోతోంది.
విజయవాడ, ఆంధ్రజ్యోతి: దుర్గగుడి రానురానూ రాజకీయ కార్యక్రమాలకు వేదికగా మారిపోతోంది. ఆధ్యాత్మికతతో వెలగాల్సిన ఆలయ ప్రాంగణం కొంతకాలంగా రాజకీయ ఎత్తుగడల్లో మునిగిపోతోంది. గ్రామ సచివాలయాలు, వార్డు వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటుచేసి ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం అన్నిచోట్లా చప్పట్ల కార్యక్రమం చేపట్టారు. అంతవరకు బాగానే ఉన్నా భక్తుల మనోభావాలను పట్టించుకోకుండా ఏకంగా ఇంద్రకీలాద్రిపై శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహించారు.
దుర్గగుడిలో పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడుతో కలిసి ఈవో ఎంవీ సురేష్‌బాబు, ఆలయ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన కార్యక్రమాలను ఆలయాల్లో నిర్వహించిన దాఖలాలు లేవు. పాలకమండలి చైర్మన్ పైలా అధికార పార్టీ నేత కాబట్టి ఆయన ఎక్కడైనా చప్పట్ల కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు. అమ్మ సన్నిధిలో ఇదేం పని..? అని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
Updated Date - 2020-10-03T17:38:19+05:30 IST