ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీరికి కరోనా రాదా?

ABN, First Publish Date - 2020-03-26T06:26:12+05:30

కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తాన్ని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క‘రోనా’!

సామాజిక దూరం పాటించని రైల్వే, ఆర్టీసీ

ఇంజనీరింగ్, గ్యారేజ్ కార్మికుల ఆవేదన


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తాన్ని 21 రోజులపాటు లాక్‌డౌన్‌ ప్రకటించింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ), విజయవాడ రైల్వే డివిజన్లు మాత్రం కరోనా విషయంలో అంత సీరియస్‌గా ఉన్నట్టుగా కనిపించటం లేదు. ప్రభుత్వ ఆదేశాలు కాదనలేక బస్సులను ఆపాయే తప్ప ఉద్యోగులను ఖాళీగా ఉంచడం ఎందుకు అనుకుని గ్యారేజీలు, వర్క్‌షాప్‌ల పేరుతో ఆర్టీసీ, రైల్వేలు ఉద్యోగుల చేత బహిరంగ ప్రదేశాలలో పనులు చేయిస్తున్నాయి. లాక్‌డౌన్‌ పటిష్ఠంగా అమలు చేయాలని, సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం మొత్తుకుంటున్నా పనులు చేయించడంపై కార్మికులు ఆవేదన చెందుతున్నారు.


రైల్వేలో అధికారుల తీరు దారుణం

ట్రాక్‌ పరిరక్షణ కోసం కీమ్యాన్‌లను మాత్రమే పనిచేయించాలని ఆదేశాలుంటే స్థానిక అధికారులు ట్రాక్‌మ్యాన్‌లను లారీల్లో గుంపులుగా తరలించి పనులు చేయిస్తున్నారు. వారికి కనీసం మాస్కులు, శానిటైజర్స్‌ వంటి రక్షణ సాధనాలు కూడా ఇవ్వటం లేదు. అనకాపల్లి నుంచి గూడూరు వరకు అన్ని ఇంజనీరింగ్‌ యూనిట్లలోనూ ఇదే పరిస్థితి. గూడ్స్‌ల నిర్వహణకు 200మంది పనిచేస్తే నిరాఘాటంగా నడిపించవచ్చని ఎస్సీఆర్‌ఎంయూ విజయవాడ డివిజన్‌ ప్రధాన కార్యదర్శి జీఎన్‌ శ్రీనివాసరావు తెలిపారు. దీనికి విరుద్ధంగా నగరంలో 8వేల మందిని విధులకు పిలుస్తున్నారన్నారు. విధులకు వచ్చేవారికి అనుమతి పత్రాలు ఇవ్వకపోవటంతో పోలీసుల చేతిలో తన్నులు తినాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. గుంపులుగా పనిచేయటం వల్ల ఎవరికైనా కరోనా సోకితే రైల్వేశాఖ బాధ్యత వహించాల్సి ఉంటుందని శ్రీనివాసరావు హెచ్చరించారు.


గ్యారేజీ కార్మికులకు తప్పని తిప్పలు     

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లోనూ గ్యారేజీ కార్మికులకు విధులు తప్పటం లేదు. సోషల్‌ డిస్టెన్స్‌ను దృష్టిలో ఉంచుకుని తక్కువ మందితో షిప్టుల వారీగా పనులు చేయించాలి. గ్యారేజీలలో గుంపులుగా పనులు చేయిస్తుండటంతో లాక్‌డౌన్‌ స్ఫూర్తికి విఘాతమేర్పడుతోంది. తాము కరోనా భయంతో పనిచేస్తున్నామని కార్మికులు వాపోతున్నారు. బస్సులను అందంగా తీర్చిదిద్దటానికి పెయింటింగ్‌లు వేయాలని, మరమ్మతులు చేయాలని ఆదేశిస్తున్నారన్నారు. విధుల్లో ఎలాంటి రక్షణ సాధనాలు ఆర్టీసీ అందించటం లేదు. సోషల్‌ డిస్టెన్స్‌ లేకుండా గుంపులుగానే పనిచేయాల్సి వస్తోందని లబోదిబోమన్నారు. 

Updated Date - 2020-03-26T06:26:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising