ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టమోటా రైతును ఆదుకుంటాం

ABN, First Publish Date - 2020-03-16T10:42:14+05:30

టమోటా రైతును ఆదుకుంటాం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోపిదేవి, మార్చి 15 : టమోటా పంటకు గిట్టుబాటు ధర చెల్లించి రైతులను ఆదుకుంటామని దివి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ కడవకొల్లు నరసింహారావు హామీ ఇచ్చారు.  కోసూరువా రిపాలెంలో ఆదివారం ఆ యన పర్యటించి టమోటా పంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు. గిట్టుబాటు ధర లేక టమోటాలను కృష్ణానదిలో పారవేయటంతో  వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అధికారులతో కలసి ఆయన రైతులతో సమావేశమయ్యారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పండిం చిన పంటకు సరైన గిట్టుబాటు ధర రానందునే పారబోస్తున్నామని రైతులు వారి దృష్టికి తీసుకొచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి టమోటా లను  విజయవాడ, గుడివాడ, మచిలీ పట్నం మార్కె ట్లలో దిగుమతి చేసుకోవటంతో జిల్లాలో సాగు చేసిన పంట కొనే వారు ఉండటం లేదని రైతులు వాపోయారు. నాందేడ్‌ వంటి ప్రాం తాల నుంచి కాయలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. మార్కెటింగ్‌ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో మోపిదేవి మండ లానికి వచ్చిన మార్కెటింగ్‌ శాఖాధికా రులు రైతుల సమస్యలను జేడీ దృష్టికి తీసుకెళ్లారు.  ఇతర ప్రాంతాల నుండి వచ్చే కాయలను దిగుమతి చేసుకోకుండా సత్వరమే ఆదేశాలు జారీ చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా చూ స్తామని మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ హామీ ఇచ్చారు.  సమస్యలను అధికారులు, ప్రజా ప్రతి నిధుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరి ంచుకోవాలే గానీ పంట పారబోయడం సరికాదని   రైతు లకు హితవుపలికారు. ఈ కార్యక్రమంలో గుడివాడ మార్కెట్‌ ఎస్టేట్‌ ఆఫీసర్‌ శ్రీకాంత్‌, దివి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యదర్శి ఆనంద్‌,   రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-16T10:42:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising