మొగల్రాజపురంలో కృష్ణుని విగ్రహం ధ్వంసం
ABN, First Publish Date - 2020-11-03T17:15:55+05:30
రాష్ట్రంలో దేవుని విగ్రహాల ధ్వంసం కొనసాగుతోంది.
విజయవాడ: రాష్ట్రంలో దేవుని విగ్రహాల ధ్వంసం కొనసాగుతోంది. తాజాగా మొగల్రాజపురంలో శివ గిరి కొండపైన ఉన్న దేవాలయంలో కృష్ణుని విగ్రహాన్ని ధ్వంసం చేశారంటూ వీహెచ్‌పీ ప్రతిపినిధులు ఆందోళనకు దిగారు. మరి కొద్దిసేపటిలో శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి, హిందూవాదులు ఆలయానికి రానున్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వీహెచ్‌పీ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో వరుస ఘటనల నేపథ్యంలో హిందూ సంఘాలు భగ్గమంటున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Updated Date - 2020-11-03T17:15:55+05:30 IST