ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుర్గమ్మ దర్శనానికి త్వరలో ట్రయల్‌ రన్‌!

ABN, First Publish Date - 2020-06-05T09:16:19+05:30

భక్తులకు శ్రీకనకదుర్గమ్మ దర్శనం పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు చేస్తున్న దుర్గగుడి అధికారులు త్వరలో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(విజయవాడ, ఆంధ్రజ్యోతి): భక్తులకు శ్రీకనకదుర్గమ్మ దర్శనం పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు చేస్తున్న దుర్గగుడి అధికారులు త్వరలో ట్రయల్‌ రన్‌ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఈనెల 8నుంచి దేవాలయాల్లో దర్శనాలను ప్రారంభించేం దుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో ఇంద్రకీ లాద్రిపై కొలువుదీరిన అమ్మవారి దర్శనాలను పునఃప్రారం భించేందుకు  రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో ట్రయల్‌ రన్‌ నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.


ఈనేపథ్యంలో ఈవో సురేష్‌బాబు గురువారం వివిధ విభాగాల అధికారు లతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. ఆలయాల్లో దర్శనాలను ప్రారంభించే విషయంలో రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి, కమిషనర్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీలు రాష్ట్రంలోని పేరు న్న దేవాలయాల ఈవోలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి కొన్ని మార్గదర్శకాలను సూచించారు. ఆ మార్గదర్శకాలను అనుసరిస్తూ అమ్మవారి దర్శనాలకు భక్తులను అనుమ తించే అంశంపై ఈవో చర్చించారు. ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే దర్శనాలను పునరుద్ధరించేం దుకు చేయాల్సిన ఏర్పాట్ల గురించి చర్చించారు. తొలుత దేవస్థానం ఉద్యోగులతోనే ట్రయల్‌ రన్‌ నిర్వహించాల ని భావిస్తున్నారు. ఇది పూర్తిస్థాయిలో విజయవం తమైతే ప్రభుత్వానికి నివే దిస్తామని, అందుకు ప్రభు త్వం అనుమతి ఇస్తేనే దు ర్గమ్మ దర్శనం లభిస్తుందని దేవస్థానం వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 

Updated Date - 2020-06-05T09:16:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising