ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేత్రపర్వంగా పుట్టింటి పసుపుకుంకుమ మహోత్సవం

ABN, First Publish Date - 2020-03-13T10:35:34+05:30

తిరుపతమ్మ చిన్న తిరునాళ్లలో ప్రదాన ఘట్టమైన అనిగండ్లపాడు అమ్మవారి పుట్టింటి పసుపు కుంకుమల మహోత్సవం గురువారం రాత్రి కనుల పండువగా జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనుగంచిప్రోలు : తిరుపతమ్మ చిన్న తిరునాళ్లలో ప్రదాన ఘట్టమైన అనిగండ్లపాడు అమ్మవారి పుట్టింటి పసుపు కుంకుమల మహోత్సవం గురువారం రాత్రి కనుల పండువగా జరిగింది. అమ్మవారి వంశీకులు కొల్లా శ్రీనివాసరావు ఇంటి వద్ద ఈవో శోభారాణి, చైర్మన్‌ అత్తలూరి అచ్యుతరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి పుట్టింటి వంశీకులు శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు తమ ఇంటి నుంచి పసుపు కుంకుమలను మేళ తాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై ఎక్కించారు. తహసీల్దార్‌ షాకిరున్నీసాబేగం టెంకాయ కొట్టి ఉత్సవాన్ని ప్రారంభిం చారు. అమ్మవారికి పసుపు కుంకుమల బండి అనిగండ్లపాడు నుంచి వేలాది మంది భక్తులతో భారీ ఊరేగింపుగా పెనుగంచిప్రోలుకు చేరు కుంది.  ఆలయం వద్దకు పుట్టింటి పసుపు కుంకుమల బండి రాగానే గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.


ఈవో, చైర్మన్లు అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛరణలతో ఘన స్వాగతం పలికి ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకెళ్లి అమ్మవారికి పుట్టింటి పసుపు కుంకుమ, పట్టు వస్ర్తాలు సమర్పించారు. అమ్మవారి పసుపు కుంకుమలు కలిపిన పసుపు కుంకుమలను ఆలయ అధికారులు భక్తులకు పంపిణీ చేశారు.  ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, వూట్ల నాగేశ్వరరావు, గ్రామ ప్రముఖులు పాటిబండ్ల లక్ష్మయ్య, పొందూరు వెంకటేశ్వరరావు, వూట్ల లక్ష్మయ్య, వల్లంకొండ బ్రహ్మం, పిడికిటి కోటేశ్వరరావు, గంగూరి ప్రసాద్‌, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.  నందిగామ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో సీఐ నాగేంద్రకుమార్‌ పర్యవేక్షణలో ఎస్‌ఐ రామకృష్ణ బందోబస్తు నిర్వహించారు. 

Updated Date - 2020-03-13T10:35:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising