పరిహారం అందించండి: సౌమ్య
ABN, First Publish Date - 2020-03-16T10:44:47+05:30
పరిహారం అందించండి: సౌమ్య
తోటరావులపాడు (చందర్లపాడు), మార్చి 15: మండలంలోని తోటరావులపాడు గ్రామంలో శనివారం రాత్రి మునేటిలో పడి మృతి చెందిన వేల్పుల పండు, బంకా శ్రీకాంత్‌ల మృతదేహాలకు ఆదివారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇంటికి చేరిన మృతదేహాలను మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, టీడీపీ జడ్పీటీసీ అభ్యర్ధి ఉన్నం నరసింహారావు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు వేల్పుల పరమేశ్వరరావు సందర్శించి నివాళులర్పించారు. ప్రభుత్వం చిన్నారుల కుటుంబ సభ్యులకు పరిహారం అందించాలని సౌమ్య డిమాండ్ చేశారు. మృతదేహాలు చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Updated Date - 2020-03-16T10:44:47+05:30 IST