ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘‘మీ మంత్రి పదవి 3 ఏళ్లు మాత్రమే.. శ్రీనివాస్ గుర్తుపెట్టుకో’’

ABN, First Publish Date - 2020-12-29T19:59:40+05:30

ఎంపీ కేశినేని నానిని తిట్టడంపై మంత్రి వెల్లంపల్లిపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : ఎంపీ కేశినేని నానిని తిట్టడంపై మంత్రి వెల్లంపల్లిపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తాగుబోతు, జూదగాడు, తిరుగుబోతు... అలాంటి మంత్రి... ఎంపీ నానిని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు.  వెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు వెల్లంపల్లికి బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఎంపీ కేశినేని నానికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ బహిరంగ క్షమాపణ చెప్పాలని... లేని పక్షంలో మంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. అమ్మవారి గుడిలో మూడు సింహాలు దొంగిలించి భూకబ్జాలు పాల్పడుతున్న మంత్రి వెల్లంపల్లికి,  ఎంపీ కేశినేని నానిని విమర్శించే అర్హత లేదన్నారు. ముఖ్యమంత్రి సమర్థించడంతో మంత్రి వెల్లంపల్లి నోటికి హద్దు లేకుండా పోయిందని మండిపడ్డారు.


పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తున్నట్లు మంత్రి వెల్లంపల్లికి కూడా లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్నారు. 2014 నుండి 2019 వరకు ఎంపీ నాని పశ్చిమ నియోజక వర్గానికి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు  నిధులను ఖర్చు పెట్టారని చెప్పుకొచ్చారు. మంత్రి వెల్లంపల్లి ఉంటున్న బ్రాహ్మణ వీధికికి రూ.33 లక్షలు ఎంపీ కేశినేని నాని ఖర్చు పెట్టారని తెలిపారు. అంతర్వేదిలో రధం తగలబడిపోతే దానికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస బాధ్యత వహించలేదని... మరి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పురుగులు పట్టిపోడా అని వ్యాఖ్యానించారు. వెల్లంపల్లి శ్రీనివాస్ అవినీతిపై ఒక పుస్తకాన్ని రాస్తున్నామని.. అతి త్వరలోనే ప్రజల ముందుకు తీసుకువస్తామన్నారు. ‘‘మీ మంత్రి పదవి 3 సవత్సరాలు మాత్రమే శ్రీనివాస్ గారు గుర్తు పెట్టుకో’’ అంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు హెచ్చరించారు.

Updated Date - 2020-12-29T19:59:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising