ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంత దారుణమా..?

ABN, First Publish Date - 2020-03-13T10:38:52+05:30

రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల దాఖలులో అధికార పార్టీ నేతలు తీవ్రమైన దారుణాలకు దిగారని, పురపాలక సంఘాల ఎన్నికల్లోనూ ఇదే తీరు కొనసాగితే ఎన్నికలను బహిష్కరించే పరిస్థితి వస్తుందని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇలాగైతే ఎన్నికలను బహిష్కరిస్తాం

 అధికార పార్టీ దురాగతాలపై ఈసీకి టీడీపీ నేతల ఫిర్యాదు


విజయవాడ, మార్చి 12(ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల దాఖలులో అధికార పార్టీ నేతలు తీవ్రమైన దారుణాలకు దిగారని, పురపాలక సంఘాల ఎన్నికల్లోనూ ఇదే తీరు కొనసాగితే ఎన్నికలను బహిష్కరించే పరిస్థితి వస్తుందని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో టీడీపీ అభ్యర్థులపై వైసీపీ నేతలు, కార్యకర్తలు చేసిన దాడులకు సంబంధించిన ఆధారాలతో విజయవాడలో ఎన్నికల సంఘ కమిషనర్‌ రమేష్‌కుమార్‌కు గురువారం ఫిర్యాదు చేశారు. అనంతరం పార్టీ నేతలు దీపక్‌రెడ్డి, వైవీబీ రాజేంద్రప్రసాద్‌, గొట్టిపాటి రామకృష్ణప్రసాద్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘మొదటి విడతలో జరిగిన నామినేషన్ల ప్రక్రియలో అధికారులు, పోలీసులతో కలిసి అధికార పార్టీ నేతలు దారుణమైన దురాగతాలకు దిగారు. రాజ్యాంగాన్ని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారు. టీడీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను నామినేషన్లను వేయనివ్వలేదు. చిత్తూరు జిల్లా పుంగనూరు నామినేషన్‌ పత్రాలను చింపేశారు. నామినేషన్‌ వేయడానికి వెళ్లిన వారికి క్యూలో ఉంటే టోకెన్లు ఇస్తే వాటినీ చింపేశారు. 


వైసీపీ కార్యకర్తలు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. కనీసం వారు ఫోన్లు ఎత్తడం లేదు. జిల్లా పరిశీలకులకు ఫోన్‌ చేసినా అదే పరిస్థితి. ఫోన్లు ఎత్తడానికి బద్ధకమా? మేము ఫోన్లు చేయకూడదా? మీరు ప్రజాసేవకులు కాదా? మా అభ్యర్థులపై దాడులు చేస్తుంటే ఆర్‌వోలు, పోలీసులు చూస్తూ ఊరుకుంటున్నారు. మాకు సమాచారం లేదని ఎన్నికల సంఘం చెబుతోంది. 172 ఘటనలపై సాక్ష్యాధారాలతో ఈసీకి ఇచ్చాం. పోలీసులు అధికార పార్టీ ఏజెంట్లుగా మారారు. అధికారులు, ప్రభుత్వం వ్యవస్థను దుర్వినియోగం చేశారు. ఈ ఘటనలకు సంబంధించిన ఆడియో, వీడియో ఆధారాలను సీడీలతో అందజేశాం. ఎన్నికల కమిషన్‌పై నమ్మకం పోతుంది. అధికార పార్టీ నేతలు నేరాలు చేయడమే కాకుండా అధికారులతోనూ చేయిస్తున్నారు. ఇది సమాజానికి చాలా ప్రమాదకరం. గంగాధర నెల్లూరులో దళిత మహిళ కన్నీళ్లతో ఫోన్‌ చేసింది. తనిఖీల పేరుతో అసభ్యంగా ప్రవర్తించారు. అసలు ప్రజాస్వామ్యం ఉందా? ఇలా ఘటనల్లో పాత్ర ఉన్న అధికారులు, పోలీసులను సస్పెండ్‌ చేయాలి’’ అని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-03-13T10:38:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising